Nano Banana AI Trend
Nano Banana AI Trend: ‘నానో బనానా’ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. gemini.google.comలో మీ ఒక్క ఫోటో ఇస్తే చాలు, కొన్ని క్షణాల్లోనే దాన్ని అద్భుతమైన 3D డిజిటల్ ఇమేజ్‌గా మార్చేస్తుంది.
బట్టల డిజైన్, ముఖంలోని భావాలు, వెనుక ఉన్న వాతావరణం వరకు ప్రతీది ఎంతో సహజంగా కనిపించడంతో ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ టూల్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండటంతో, ప్రతి ఒక్కరూ తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు.
“నానో బనానా” అనేది అత్యాధునిక గూగుల్ AI ఇమేజ్ టూల్ అయిన జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్‌కు నెటిజన్లు పెట్టిన ముద్దుపేరు. ఇది ఎలాంటి ఫొటోనైనా హైపర్-రియలిస్టిక్ 3D బొమ్మగా మార్చుతోంది. దీని సక్సెస్ వెనుక మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి.
సులభంగా వాడటం: దీన్ని వాడటానికి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. గూగుల్ అకౌంట్ ఉంటే చాలు.
చూడటానికి అద్భుతంగా ఉండటం: వచ్చే ఫలితాలు అచ్చం మన టేబుల్ మీద పెట్టుకునే ఖరీదైన బొమ్మల్లా కనిపిస్తాయి.
షేర్ చేసుకోవడం తేలిక: సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి పర్ఫెక్ట్‌గా ఉండటంతో లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.
సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌లో భాగమవ్వడంతో దీని క్రేజ్ మరింత పెరిగింది. చాలా మంది తమకు ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, పెంపుడు జంతువుల ఫొటోలను 3D బొమ్మలుగా మారుస్తూ సోషల్ మీడియాలో నింపేస్తున్నారు.
ఈ ట్రెండ్‌లో మీరు కూడా భాగం కావాలనుకుంటున్నారా? కేవలం రెండు నిమిషాల్లో మీ ఫొటోను కూడా ఇలా మార్చేయవచ్చు.
1) https://gemini.google.com/ కి వెళ్ళండి
2) + సింబల్ పై క్లిక్ చేసి, అప్లోడ్ ఫైల్స్ ద్వారా మీ ఇమేజ్ ని అప్లోడ్ చేయండి
3) దాని తర్వాత కింద ఇచ్చిన ప్రాంప్ట్ ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి
Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base, with no text on the base. The content on the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packaging box, designed in a style reminiscent of high-quality collectible figures, printed with original artwork. The packaging features two-dimensional flat illustrations.
4) కొన్ని సెకెన్లు వెయిట్ చేసిన తర్వాత ఇమేజ్ వస్తుంది.
ఒకవేళ జెమినీ ai వర్క్ చేయకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు… ఎలాగంటే
స్టెప్ 1: ముందుగా Google AI Studio వెబ్‌సైట్‌కి వెళ్లి మీ గూగుల్ ఖాతాతో లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: అక్కడ కనిపించే ఆప్షన్లలో “Nano Banana” లేదా “Gemini 2.5 Flash Image” టూల్‌ని ఎంచుకోండి.
స్టెప్ 3: ఇప్పుడు మీ ఫోటోను అప్‌లోడ్ చేయడానికి “+” బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4 (Optional): ఇంకా అద్భుతమైన ఫలితం కోసం, మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ కూడా ఇవ్వవచ్చు. అంటే, మీకు బొమ్మ ఎలా ఉండాలో మాటల్లో వివరించడం. ఉదాహరణకు, “A beautiful girl in a white dress, standing on a wooden table with a smiling face” అని టైప్ చేయవచ్చు.
స్టెప్ 5: అంతే! AI మీ ఫోటోను ప్రాసెస్ చేసి 3D ఫొటోను సృష్టిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోండి.
Open the Gemini app or https://t.co/382WL5xSvc, upload the photo you want to use, and paste the prompt below. Feel free to tweak the prompt so it’s perfect for your use case.
Prompt ⬇️
Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic…— Google Gemini App (@GeminiApp) September 1, 2025
క్వాలిటీ ఫొటోలు: మీరు ఇచ్చే ఫొటో ఎంత క్లియర్‌గా, మంచి వెలుతురులో ఉంటే, ఫలితం అంత అద్భుతంగా వస్తుంది.
వివరాలు జోడించండి: టెక్స్ట్ ప్రాంప్ట్‌లో దుస్తులు, లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్ వంటి వివరాలు ఇస్తే, బొమ్మ మరింత సహజంగా కనిపిస్తుంది.
కొత్తగా ప్రయత్నించండి: ఒకే ఫొటోను వేర్వేరు యాంగిల్స్‌లో, విభిన్నమైన టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో ట్రై చేసి చూడండి.
ఇదొక ట్రెండ్ మాత్రమే కాదు..
నానో బనానా కేవలం ఒక సరదా ట్రెండ్‌గా కనిపించినా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తును సూచిస్తోంది. ఒకప్పుడు 3D డిజైనింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అనేవి కేవలం నిపుణులకు మాత్రమే సాధ్యమయ్యేవి. కానీ ఇప్పుడు, ఇలాంటి టూల్స్ వల్ల ఎవరైనా సరే తమ ఆలోచనలకు జీవం పోయవచ్చు.
వినోదం, మార్కెటింగ్, విద్య, కథలు చెప్పడం వంటి ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ఈరోజు సోషల్ మీడియాలో మీమ్‌గా మొదలైన ఈ ట్రెండ్, రేపటి క్రియేటివ్ ప్రపంచానికి పునాది కావచ్చు.