Netflix Password Sharing : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఫ్రీగా పాస్‌వర్డ్ షేరింగ్ చేసుకోలేరు.. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల జాబితా మీకోసం..!

Netflix Password Sharing : ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు అందించే పాస్‌వర్డ్ షేరింగ్‌ (Password Sharing)ను నిలిపివేసింది. Netflix ఇకపై తమ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ ఫ్రీగా షేర్ పంచుకోలేరు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ నివేదిక తెలిపింది.

Netflix Password Sharing : ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు అందించే పాస్‌వర్డ్ షేరింగ్‌ (Password Sharing)ను నిలిపివేసింది. Netflix ఇకపై తమ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ ఫ్రీగా షేర్ పంచుకోలేరు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ నివేదిక తెలిపింది. OTT దిగ్గజం 2023 మొదటి త్రైమాసికంలో పేమెంట్ షేరింగ్ ఫీచర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభం కానుంది.

నెట్‌ప్లిక్స్ యూజర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాలంటే ఇకపై Netflix పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నెట్‌ఫ్లిక్స్ Q1లో పేమెంట్ షేరింగ్ మరింత విస్తృతంగా ప్రారంభించాలని భావిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేరింగ్ (100M+ ఫ్యామిలీలు) ద్వారా Netflixలో యూజర్ల బేస్‌ను బలహీనపరుస్తుందని కంపెనీ తెలిపింది.

నెట్‌ఫ్లిక్స్ పేమెంట్ షేరింగ్ ఫీచర్ అంటే ఏమిటి :
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ తగ్గుతున్న సబ్‌స్క్రైబర్ బేస్‌తో నష్టాలను చవి చూస్తోంది. కొత్త పేమెంట్ షేరింగ్ ఫీచర్‌తో, ఇతర పేమెంట్ల సబ్‌స్ర్కైబర్ల నుంచి ID పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకుని OTT కంటెంట్‌ను ఉచితంగా పొందవచ్చు. యూజర్ల నుంచి డబ్బు వసూలు చేయాలని Netflix లక్ష్యంగా పెట్టుకుంది. 2023 మొదటి త్రైమాసికంలో పెయిడ్-షేరింగ్ ఫీచర్‌ను మరిన్ని దేశాల్లో రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కొత్త ఫీచర్‌తో యూజర్లు యాప్‌లో ఒక ఆప్షన్ చూడవచ్చు.

అందుకు యూజర్లు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ చౌకైన సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కోరుకునే యూజర్లకు యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌గా యాడ్స్‌తో బేసిక్‌ను కూడా అందిస్తోంది. అమెరికా, యూకే, దక్షిణ కొరియా మరిన్నింటిలో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. భారతీయ యూజర్ల కోసం, నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే బడ్జెట్ ప్లాన్‌ని కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ భారత మార్కెట్లో అన్ని నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఓసారి చూద్దాం.

Netflix password sharing ending soon_ List of Netflix plans available in India

Read Also : OnePlus Pad Design : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఆండ్రాయిడ్ టాట్లెట్ ప్యాడ్ వచ్చేస్తోంది.. డిజైన్ ఎలా ఉంటుందో తెలుసా?

భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు ఇవే :
నెట్‌ఫ్లిక్స్ కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు అనేక రకాల ప్లాన్‌లను అందిస్తుంది. భారతీయ కస్టమర్ల కోసం OTT ప్లాట్‌ఫారమ్ అందించే ప్లాన్‌ల లిస్టును అందిస్తుంది. ముఖ్యంగా, అన్ని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లు నెలవారీ వ్యాలిడిటీతో వస్తాయి.

Netflix రూ.149 మొబైల్ ప్లాన్ : ఈ మొబైల్-ఓన్లీ ప్లాన్ ద్వారా వీడియో క్వాలిటీని అందిస్తుంది. ఈ ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఒకే డివైజ్‌లో 480p స్ట్రీమింగ్ అందిస్తుంది. లో వీడియో క్వాలిటీ, బడ్జెట్ సపోర్టు ఆప్షన్ కోసం చూస్తున్న యూజర్లకు ఈ ప్లాన్ సులభంగా ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ రూ. 199 ప్రైమరీ ప్లాన్ : అప్‌గ్రేడ్ చేసిన యూజర్ల కోసం ప్రాథమిక ప్లాన్ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీ చూడవచ్చు. ఒకే డివైజ్‌లో 480p స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ని ఒకే డివైజ్ ఒకేసారి చూడాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరైనదిగా చెప్పవచ్చు.

Netflix రూ. 499 స్టాండర్డ్ ప్లాన్ : మీరు మల్టీ డివైజ్‌ల్లో హై-క్వాలిటీ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ ఒక డివైజ్‌లో 480p, ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీతో సహా రెండు డివైజ్‌లలో 1080p స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. OTT కంటెంట్‌ని యాక్సస్ చేసేందుకు ఫ్యామిలీలు లేదా స్నేహితులకు ఈ ప్లాన్ యాక్సస్ చేసుకోవచ్చు.

Netflix రూ. 649 ప్రీమియం ప్లాన్ : 4K HDRలో కంటెంట్‌ యూజర్ల కోసం, ప్రీమియం ప్లాన్ గరిష్టంగా నాలుగు డివైజ్‌ల్లో 4K HDR స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ పెద్ద కుటుంబాలు లేదా హై రిజల్యూషన్‌తో ఎక్కువగా చూడవచ్చు. ప్రీమియం ధరను చెల్లించడానికి ఇష్టపడే యూజర్లకు అనుకూలంగా ఉంటుంది. 4K HDR స్ట్రీమింగ్ క్వాలిటీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది. సినిమా, టీవీ షోలను కూడా వీక్షించవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Emergency SOS : గూగుల్ మ్యాప్స్ పనిచేయక దారితప్పిన జంట.. ఇద్దరు మహిళలను రక్షించిన ఐఫోన్ 14 శాటిలైట్ ఫీచర్..!

ట్రెండింగ్ వార్తలు