New E-cycles from Hero: దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లూటూత్ తో వచ్చిన సైకిల్

విద్యుత్ స్కూటర్లు, వాహనాలను తయారు చేస్తున్న హీరో సంస్థ తన అనుబంధ సంస్థయిన "హీరో లేక్ట్రో" నుంచి F2i, F3i అనే రెండు ఈ-సైకిల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

New E-cycles from Hero: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో సంస్థ తన సైకిల్ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా, విద్యుత్ తో నడిచే సైకిల్ ను హీరో సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. విద్యుత్ స్కూటర్లు, వాహనాలను తయారు చేస్తున్న హీరో సంస్థ తన అనుబంధ సంస్థయిన “హీరో లేక్ట్రో” నుంచి F2i, F3i అనే రెండు ఈ-సైకిల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. లైఫ్ స్టైల్ కోవలోకి వచ్చే ఈ రెండు సైకిళ్ళల్లో, బ్లూటూత్ సహా మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఈ రెండు సైకిల్స్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

ప్రధానంగా ఈ రెండు సైకిల్స్ లో చెప్పుకోదగిన విషయం, వీటిలోని బ్లూటూత్ కనెక్టివిటీ గురించి. ఇండియాలో తయారయ్యే సైకిల్స్ లో మొట్టమొదటిసారిగా బ్లూటూత్ ఫీచర్స్ తో వస్తున్నాయి F2i, F3i సైకిల్స్. దీంతో వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ లో సంస్థ అందించే యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని బ్లుటూత్ ద్వారా సైకిల్ ను అనుసంధానించవచ్చు. అందులో నమోదు అయ్యే వివరాల ప్రకారం వినియోగదారులు ఎంత దూరం ప్రయాణించారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయి, జిపిఎస్ మ్యాప్ వంటి విషయాలు గమనించవచ్చు.

Also Read: Special car for PM Modi: ప్రధాని మోదీ రూ.12 కోట్ల విలువైన కారు ప్రత్యేకతలు ఇవే!

6.4Ah బ్యాటరీ సామర్ధ్యంతో వస్తున్న ఈ రెండు సైకిల్స్ 250W BLDC మోటార్ కలిగి ఉంటాయి. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 27-35 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఛార్జింగ్ అయిపోతే తొక్కుకుంటూ తిరిగి రావొచ్చు. 7 స్పీడ్ గేర్స్, 100ఎంఎం సస్పెన్షన్, 27.5 అంగుళాలు(వెనుక), 29 అంగుళాలు(ముందు) టైర్లు, ముందువెనుక డిస్క్ బ్రేక్ వంటి అధునాతన ఫీచర్స్ F2i, F3i సైకిల్స్ లో ఉన్నాయి. ప్రధానంగా నగరాల్లోని యువతను, వారాంతాల్లో పర్యటనలకు వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకుని విడుదల చేసిన ఈ సైకిల్ ధరలు F2i- ₹39,999, F3i- ₹40,999గా ఉన్నాయి.

Also Read: Viral Video: ఎవరూ లేరనుకుని డాన్స్ ఇరగదీసింది: సూపర్ వైరల్ అయింది

ట్రెండింగ్ వార్తలు