New Citroen Aircross SUV launched in India at Rs 8.49 lakh, Check Full Details
Citroen Aircross SUV Launch : కొత్త కారు కొంటున్నారా? భారత మార్కెట్లో సిట్రోయెన్ ఇండియా నుంచి సరికొత్త ఎస్‌యూవీ కారు వచ్చేసింది. ఈ సిట్రోయెన్ కొత్త ఎయిర్‌క్రాస్‌ను రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఎస్‌యూవీ కారు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక, డెలివరీలు అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఇప్పుడు రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లను కలిగి ఉంది. 1.2-లీటర్ జెన్-3 ప్యూర్‌టెక్ 110 టర్బో, 1.2-లీటర్ ప్యూర్‌టెక్ 82, టర్బో యూనిట్ 110bhp, 190Nm అభివృద్ధి చేస్తుంది. అయితే, యూనిట్ 82bhp, 110Nm ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో వస్తుంది. టర్బో యూనిట్‌తో 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఎటీ నేచురల్ యూనిట్‌తో 5-స్పీడ్ ఎంటీ ఉన్నాయి.
కొత్త ఎయిర్‌క్రాస్ భద్రత, సౌకర్యం మొత్తం డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అనేక అప్‌గ్రేడ్స్‌తో వచ్చింది. లేటెస్ట్ ఫీచర్లలో మెరుగైన సెక్యూరిటీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి. మొత్తంమీద, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్-హోల్డ్ అసిస్ట్‌తో సహా 40 కన్నా ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఎస్‌యూవీ ఇప్పుడు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, క్లైమేట్ కంట్రోల్‌తో ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్‌తో వస్తుంది. మెరుగైన ఇంటీరియర్ ఫీచర్లలో డోర్‌లపై పవర్ విండో స్విచ్‌లు, ప్యాసింజర్ వైపు గ్రాబ్ హ్యాండిల్స్, పవర్-ఫోల్డింగ్ ఓఆర్‌వీఎమ్, బ్యాక్ ఏసీ వెంట్ ఉన్నాయి.
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ 5, 5+2 సీటింగ్ ఆప్షన్‌లలో లభిస్తుంది. మూడో వరుస సీట్లను తొలగింపుతో బూట్ సామర్థ్యం 511 లీటర్లు వరకు అందిస్తుంది. వేరియంట్‌ల విషయానికొస్తే యూ, ప్లస్, మాక్స్ మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. వేరియంట్ వారీగా కొత్త సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
వేరియంట్ (5-సీటర్) ధర ఎంతంటే? :
5+2 సీటర్ వెర్షన్‌ల కోసం కొనుగోలుదారులు అదనంగా రూ.35వేలు చెల్లించాల్సి ఉంటుంది.
Read Also : Turkish Influencer : అందుకే నేను చనిపోతున్నాను.. భవనంపై నుంచి దూకి టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య..!