New Smartphones 2025
New Smartphones 2025 : మార్చి 2025 వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్ ఔత్సాహికులకు ఇదే బెస్ట్ టైమ్. మీరు మార్చిలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మార్చిలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. శాంసంగ్, షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటికే లాంచ్ చేశాయి.
వివో, పోకో కూడా ఈ నెలలో కొత్త మోడళ్లను లాంచ్ చేయనున్నాయి. మార్చి 2న శాంసంగ్ ఒకటి కాదు, మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసి సంచలనం సృష్టించింది. అదనంగా, షావోమీ 15 సిరీస్ ఈరోజు (MWC 2025)లో ఆవిష్కరించింది. ఈ నెలలో భారత మార్కెట్‌లోకి వచ్చే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
1. శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ :
శామ్సంగ్ గెలాక్సీ A సిరీస్‌లో మొత్తం 3 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. అందులో గెలాక్సీ A56, A36, A26 ఉన్నాయి. ఈ 3 స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15పై వన్ UI 7.0తో రన్ అవుతాయి. 6 సంవత్సరాల OS అప్‌డేట్స్ అందిస్తుంది.
హై క్వాలిటీ ఫోటోగ్రఫీ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ 3 ఫోన్లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్‌యూఐ 7పై రన్ అవుతాయి.
A56 మోడల్స్ ఎక్సినోస్ 1580 ప్రాసెసర్, A26 Exynos 1380 ప్రాసెసర్, A36 క్వాల్‌కామ్ స్నాప్‍డ్రాగన్ 6 జనరేషన్ 3 చిప్‌సెట్‌లతో అమర్చబడి ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP కెమెరా A36, A56 లలో అందుబాటులో ఉంటుంది. అలాగే, శాంసంగ్ A26లో 13MP కెమెరా ఉంది. ఈ 3 స్మార్ట్‌ఫోన్‌లు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి.
2. వివో T4x ఫోన్ :
వివో T4x ఫోన్ మార్చి 5న భారత మార్కెట్లో మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. వివో T4x 5జీలో రెండు రియర్ కెమెరాలు ఉంటాయి. అందులో ఒకటి 50MP ప్రైమరీ కెమెరా. అలాగే, ఫోన్ 6,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
వివో T4x 5జీలో ఏఐ ఫీచర్లు ఉంటాయని వివో తెలిపింది. లీక్‌ల ప్రకారం.. ఏఐ ఎరేస్, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్, ఏఐ డాక్యుమెంట్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో కనిపిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉండనుందిద. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి ఎక్కువ పవర్ వినియోగించేవారికి బెస్ట్ మోడల్ అని చెప్పవచ్చు.
3. ఐక్యూ నియో 10ఆర్ :
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐక్యూ నియో 10R ఫోన్ మార్చి 11న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరా సెటప్‌తో రానుంది. ఐక్యూ నియో 10R చాలా స్పెసిఫికేషన్లు ప్రస్తుతం తెలియకపోయినా, లీక్‌ల ప్రకారం.. గణనీయమైన అప్‌గ్రేడ్‌లతో రానుంది.
అమెజాన్ మైక్రోపేజీ ఆధారంగా ఐక్యూ నియో 10R ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. ఐక్యూ నియో 10R క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 SoC చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత వేగవంతమైనది కంపెనీ చెబుతోంది. ఈ ఐక్యూ మోడల్ హీటింగ్ కోసం 6043mm2 స్టీమ్ కూలింగ్ రూం కలిగి ఉంది.
80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 6,400mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 144 Hz రిఫ్రెష్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్‌తో వస్తుందని భావిస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే.. ఐక్యూ OISతో 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
సెల్ఫీల కోసం ఐక్యూ 10R ఫోన్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. మార్చి 11న ఈ 5జీ ఫోన్ లాంచ్ కానుంది. మెరుగైన గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఇ-స్పోర్ట్స్ మోడ్, మాన్‌సర్ట్ మోడ్‌తో సహా విభిన్న గేమింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. అంతేకాదు.. 5 గంటల స్టేబుల్ 90fps గేమింగ్‌ను అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అత్యంత వేగవంతమైన ఫోన్‌గా చెప్పవచ్చు.
ఐక్యూ నియో 10R ధర (అంచనా) :
భారత మార్కెట్లో దాదాపు రూ.30వేల ధరకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ కచ్చితమైన ధరను వెల్లడించలేదు. లీక్‌ల ప్రకారం.. బ్యాంక్ ఆఫర్‌లతో రూ.29,999కి అందుబాటులో ఉంటుందని సూచిస్తున్నాయి. ఐక్యూ నియో 9 ప్రో లాంచ్ ధర కన్నా తక్కువగానే ఉండవచ్చు. ఐక్యూ నియో 10R భారత మార్కెట్లో (Raging Blue, Moonknight Titanium) కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
4. షావోమీ 15 సిరీస్ :
షావోమీ 15 సిరీస్ కూడా మార్చి 2న సాయంత్రం 6:30 గంటలకు లాంచ్ అయింది. ఈ లాంచ్‌లో షావోమీ 15, షావోమీ 15 Ultra ఉన్నాయి. అమెజాన్‌లో త్వరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. అల్ట్రా మోడల్ అద్భుతమైన ఫీచర్లతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కలిగిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. ఇందులో అద్భుతమైన 200MP పెరిస్కోప్ కెమెరా ఉండవచ్చు. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
షావోమీ 15 సిరీస్ కింద షావోమీ 15 అల్ట్రా చైనాలో లాంచ్ అయింది. షావోమీ 15 అల్ట్రా 6.73-అంగుళాల 2K M8 12-బిట్ ఓఎల్ఈడీ ఎల్టీపీఓ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిఫ్రెష్ రేటు 1-120Hz నుంచి మారవచ్చు, గరిష్ట ప్రకాశం 3200 నిట్స్ వరకు ఉంటుంది.
కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్, 200MP సూపర్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 4K 60fps రికార్డింగ్‌తో 32MP కెమెరా ఉంది.
5. పోకో M7 5జీ :
పోకో బ్రాండ్ మార్చి 3న మధ్యాహ్నం 12 గంటలకు పోకో M7 5Gని లాంచ్ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కొత్త ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర వివరాలు వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10వేలు లోపు ఉంటుందని అంచనా.
స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12జీబీ ర్యామ్ (6జీబీ ఫిజికల్, 6జీబీ వర్చువల్) అందిస్తుంది. 6.88-అంగుళాల డిస్‌ప్లే, 50ఎంపీ కెమెరాను కలిగిన ఈ ఫోన్ రోజంతా ఛార్జింగ్ అందించే 5160mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
6. నథింగ్ ఫోన్ (3ఎ) సిరీస్ :
నథింగ్ ఫోన్ (3a) సిరీస్ మార్చి 4న భారత మార్కెట్లో మధ్యాహ్నం 3:30 గంటలకు లాంచ్ కానుంది. నథింగ్ సిరీస్ కింద నథింగ్ ఫోన్ (3a), నథింగ్ ఫోన్ (3a) ప్రోలను లాంచ్ చేస్తుంది. నథింగ్ ఫోన్ 3a, 3a ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.
ఈ రెండు ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ ఉండవచ్చు. రెండు ఫోన్‌లలో 3 బ్యాక్ కెమెరాలు ఉంటాయి. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 50ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇందులో 5,000mAh బ్యాటరీ, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.