Nokia 300 Power Bank : పాత నోకియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 45 రోజుల బ్యాటరీతో కొత్త పవర్ బ్యాంక్ ఫోన్! ధర జస్ట్ ఎంతంటే?
Nokia 300 Power Bank : నోకియా నుంచి పవర్ ఫీచర్ ఫోన్ వచ్చేసింది. కంపెనీ ఈ చిన్న ఫోన్‌లో 3700mAh బ్యాటరీని అందిస్తోంది. నోకియా 300 పవర్ బ్యాంక్ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలివే..
- Sreehari A
- Published on- July 19, 2026 / 07:53 PM IST
Nokia 300 Power Bank
- ఈ నోకియా ఫోన్‌లో 2.4 అంగుళాల డిస్‌ప్లే
- రియర్ సైడ్ 0.3MP కెమెరా సెన్సార్
- మెమరీని 32GB వరకు పెంచుకునే అవకాశం
Nokia 300 Power Bank : నోకియా లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. కంపెనీ నోకియా 300 పవర్ బ్యాంక్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఫోన్ ఫీచర్ ఫోన్ అయినా పేరుకు తగ్గట్టుగానే కంపెనీ పవర్ ఫోన్‌గా ప్రవేశపెట్టింది. ఈ నోకియా ఫోన్ బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. కీలక స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించింది. అంతేకాదు.. ఈ ఫోన్‌లో 2.4-అంగుళాల డిస్‌ప్లే కూడా ఉంది. స్ట్రాంగ్ బాడీతో వస్తుంది.
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP రేటింగ్ అందిస్తుంది. అలాగే, భారీ బ్యాటరీతోనూ వస్తుంది. ఫీచర్ ఫోన్‌కు (Nokia 300 Power Bank) ఇదే భారీ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ అద్భుతమైన నోకియా ఫోన్‌లో కంపెనీ ఇంకా ఏయే ఫీచర్లను అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నోకియా 300 4జీ పవర్ బ్యాంక్ ధర :
కంపెనీ ఫిలిప్పీన్స్‌లో నోకియా 300 పవర్ బ్యాంక్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర PHP 1,990 (దాదాపు రూ. 3వేలు). షోపీ నుంచి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, గోల్డ్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
4జీ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్లు :
నోకియా 300 4జీ పవర్ బ్యాంక్ అనేది అద్భుతమైన ఫీచర్ ఫోన్. లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 2.4-అంగుళాల QVGA డిస్‌ప్లే ఉంది. స్ట్రాంగ్ డిజైన్‌తో వస్తుంది. మంచి గ్రిప్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్‌లో 0.3MP రియర్ కెమెరా సెన్సార్ ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో వస్తుంది. దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. తద్వారా మెమరీని 32GB వరకు పెంచుకోవచ్చు.
Read Also : iQOO Mini Tablet : ఐక్యూ 16తో అదిరిపోయే కొత్త మినీ టాబ్లెట్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఒక్కమాటలో చెప్పాలంటే.. నోకియా 300 పవర్ బ్యాంక్ ఫోన్ అనేది పవర్‌ఫుల్ ఫీచర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. కంపెనీ ఈ చిన్న ఫోన్‌లో 3700mAh బ్యాటరీని అమర్చింది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 45 రోజుల వరకు రన్ అవుతుందని కంపెనీ పేర్కొంది.
మీ ఫోన్ స్టాండ్‌బై టైమ్ 26 గంటల టాక్ టైమ్, ఫ్లాష్‌లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు 23 గంటల టైమ్ కూడా అందిస్తుంది. ఈ బ్రాండ్ ఫ్లాష్‌లైట్ వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఫ్లాష్‌లైట్ సాధారణ ఫీచర్ ఫోన్ కన్నా 5 రెట్లు ఎక్కువ లైటింగ్ అందిస్తుందని, ఐఫోన్ 16 ప్రో కన్నా రెండింతలు కాంతిని అందిస్తుందని తెలుస్తోంది.
ఈ ఫోన్‌లో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ స్పెషల్ ఫీచర్ ఉంది. మీ ఫోన్ పవర్ బ్యాంక్‌గా వాడుకోచవ్చు. ఇందుకోసం ఒక స్పెషల్ బటన్ కూడా ఉంది. ఆ బటన్‌ను ట్యాప్ చేస్తే చాలు.. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ యాక్టివేట్ అవుతుంది. మీ ఫోన్ పవర్ బ్యాంక్‌గా మారిపోతుంది. 5W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
