ఫుల్ సైజు కీబోర్డుతో Nokia PureBook X14 కొత్త ల్యాప్ టాప్‌లు
- Sreehari A
- Published On : December 13, 2020 / 06:10 PM IST
Nokia PureBook X14 Laptop With Intel Core i5 Processor : భారతదేశంలో ప్యూర్‌బుక్ సిరీస్‌లో భాగంగా Nokia PureBook X14ని ఫస్ట్ నోకియా ల్యాప్‌టాప్‌గా ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించి మైక్రోసైట్ ఫ్లిప్ కార్ట్‌లో అప్‌డేట్ వచ్చింది. నోకియా ప్యూర్‌బుక్ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లోని జాబితాలో కొన్ని మల్టీపుల్ నోకియా ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేయబోతోంది. ఫుల్ సైజు కీబోర్డు, లార్జ్ టచ్ ప్యాడ్ తో వస్తున్న నోకియా ల్యాప్ టాప్ లు బ్లాక్ కలర్ ఆప్షన్‌లో రానుంది.
Nokia PureBook X14 స్పెషిఫికేషన్లు + ఫీచర్లు :
నోకియా ప్యూర్‌బుక్ X14 వేరియంట్‌లో Intel Core i5 ప్రాసెసర్‌తో వస్తోంది. మైక్రోసైట్ ప్రకారం.. Dolby Vision Atmos టెక్నాలజీస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.1 కిలోగ్రాములు. నోకియా ల్యాప్‌టాప్ ఫొటోలో USB 3.0 HDMI పోర్ట్‌లు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ నోకియా ప్యూర్‌బుక్ X14 ఎప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందో ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి వివరాలు పేర్కొనలేదు.
నోకియా ప్యూర్ బుక్ X14 వెర్షన్ నుంచి మొత్తం 9 మోడళ్ళు తీసుకొస్తోంది. అందులో 5 మోడళ్లను i5 ప్రాసెసర్ సపోర్ట్ అందించనుండగా.. మిగతా 4 మోడళ్లలో i3 ప్రాసెసర్ తో వస్తున్నాయి. టెన్త్ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లు అయ్యే అవకాశం ఉంది. కొత్త ల్యాప్‌టాప్‌లు నోకియా బ్రాండింగ్ అయినప్పటికీ థర్డ్ పార్టీతో తయారైనట్టు తెలుస్తోంది.
