Nokia X30 5G Price : నోకియా X30 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. రూ. 12వేలు డిస్కౌంట్.. కొత్త ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Nokia X30 5G Price : కొత్త నోకియా 5G ఫోన్ ధర తగ్గింది. దాదాపు రూ. 12వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కొత్త ఫోన్ కోసం ఇప్పుడే ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోండి.

Nokia X30 5G Price in India Dropped by Rs.12,000 Seven Months After India

Nokia X30 5G Price : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ (HMD Global) భారత్‌లో నోకియా X30 5G ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. భారత మార్కెట్లో ఫోన్ లాంచ్ చేసిన కేవలం 7 నెలల తర్వాత కంపెనీ ఈ ఫోన్‌ను దేశంలో 12వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ ఫోన్ 6.43-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. నోకియా X30 5G ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,200mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Zebronics Smart TV Sale : భలే ఉంది భయ్యా టీవీ.. ఈ కొత్త స్మార్ట్‌టీవీ ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు.. ఈ డీల్‌ మిస్ చేసుకోవద్దు!

భారత్‌లో నోకియా X30 5G ధర ఎంతంటే? :
నోకియా X30 5Gలో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా రూ. 12వేలు తగ్గింపు అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ అసలు ధర రూ. 48,999 ఉండగా… కంపెనీ రాయితీని అందిస్తోంది. తద్వారా ధర రూ. 36,999కు తగ్గింది. ఇందులో సింగిల్ 8GB + 256GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్ అదనంగా, హ్యాండ్‌సెట్‌పై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది.

Nokia X30 5G Price in India Dropped by Rs.12,000 Seven Months After India

నోకియా X30 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఫిబ్రవరిలో లాంచ్ అయిన నోకియా X30 5G ఫోన్ 6.43-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 700 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ద్వారా ఆధారితమైనది. 8GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది.

3 ఏళ్ల నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్స్ పాటు 3 ప్రధాన OS అప్‌గ్రేడ్‌లను కంపెనీ అందిస్తోంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. OIS సపోర్టుతో 50MP ప్యూర్‌వ్యూ ప్రైమరీ సెన్సార్ 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో నోకియా X30 5G షిప్‌లను పొందవచ్చు.

సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16MP షూటర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 802.11 a/b/g/n/ac/ax-ready, బ్లూటూత్ 5.1, NFC, GPS/AGPS, GLONASS, Beidou USB టైప్-C పోర్ట్, నోకియా X30 5G ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,200mAh బ్యాటరీతో వస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

Read Also : Vivo T2 Pro 5G Launch : వివో T2 ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. లాంచ్ కావడమే ఆలస్యం..!

ట్రెండింగ్ వార్తలు