Nothing Phone (1) : నథింగ్ ఫోన్‌లో ఫస్ట్ OTA అప్‌డేట్‌తో బగ్స్ అన్ని ఫిక్స్.. కెమెరా పర్ఫార్మెన్స్ అదుర్స్..!

ప్రముఖ నథింగ్ ఫోన్ (1) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ లాంచ్ అయిన 10 రోజుల తర్వాత ఫస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చింది.

Nothing Phone (1) : ప్రముఖ నథింగ్ ఫోన్ (1) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ లాంచ్ అయిన 10 రోజుల తర్వాత ఫస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చింది. ఈ డివైజ్ లాంచ్ చేయడానికి ముందే ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ మెరుగుపరిచేలా కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు నథింగ్ కంపెనీ కొత్త OTA అప్‌డేట్‌ను విడుదల చేసింది. కొన్ని సమస్యలను పరిష్కరించింది. కెమెరా పనితీరును కూడా పరిష్కరించే లక్ష్యంతో కంపెనీ వర్క్ చేస్తోంది.

నథింగ్ రెండు కొత్త ఫీచర్లను కూడా అందిస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం.. కొత్త అప్‌డేట్ లాక్ స్క్రీన్ సమస్యను ఫిక్స్ చేసింది. ఫింగర్ ఫ్రింట్ ఐకాన్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేయలేకపోయాయరు. అది స్ర్కీన్‌పై కనిపించదు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా చాలా సజావుగా వర్క్ చేయడం లేదు. ప్రస్తుతం కంపెనీ దాన్ని అప్‌డేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త Glph ఇంటర్‌ఫేస్ ద్వారా డివైజ్ బ్యాటరీ లైఫ్ మరింత మెరుగుపర్చనుంది.

Biden Tests Positive For Covid 19, Has ‘mild Symptoms’

మీరు ఈ కొత్త అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. తక్కువ-కాంతి వాతావరణంలో ఫోటోలు తీస్తున్నప్పుడు డైనమిక్ పరిధితో పాటు మరింత క్లారీటీని చూడవచ్చు. మెయిన్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాల కలర్ కూడా మెరుగుపరుస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరాను ఉపయోగించేటప్పుడు మంచి ఫోటో క్లారిటీని పొందవచ్చు. యూజర్లు ఇప్పుడు పోర్ట్రెయిట్ మోడ్‌లో కూడా గ్లిఫ్ ఫిల్ లైట్ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. కొత్త అప్ డేట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత తక్కువ కాంతిలోనూ తీసిన షాట్‌లు నాయిస్‌ను తగ్గించిలా చేసుకోవచ్చు.

నథింగ్ ఫోన్ (1) యూజర్లు ఇప్పుడు హోమ్ స్క్రీన్‌లో సెర్చ్ బార్ ఆప్షన్ కూడా పొందుతారు. ప్రయోగాత్మక NFT గ్యాలరీ విడ్జెట్ అలాగే టెస్లా కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. కొత్త అప్‌డేట్ 111MB సైజులో ఉంటుంది. జూలై నెలలో Android సెక్యూరిటీ ప్యాచ్‌ను అందిస్తుంది. నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో జూలై 12న లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 31,999కి అందుబాటులో ఉంది. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్ సహా రెండు కలర్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంది. Xiaomi, OnePlus, Samsung, Poco వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్‌లతో పోటీగా మార్కెట్లోకి నథింగ్ ఫోన్ (1) వచ్చింది.

Read Also :  Nothing Phone (1) pre-orders : హాట్ కేకుల్లా అమ్ముడైన నథింగ్ ఫోన్ (1).. మళ్లీ ప్రీ-ఆర్డర్లు.. బుక్ చేసుకోండిలా..!

ట్రెండింగ్ వార్తలు