Nothing Phone 1 to be priced below Rs 25,000 during Flipkart Big Billion Days
Flipkart Big Billion Days : కొత్త ఫోన్ కొనేందుకు ఆలోచిస్తున్నారా? రూ. 25వేల లోపు ధరలో బ్యాంకింగ్ మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అదే ధరలో నథింగ్ ఫోన్ (1) (Nothing Phone 1)ని సొంతం చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సమయంలో ఈ ఫోన్ ధర రూ.25వేల కన్నా తక్కువగా ఉంటుంది. అంటే.. అక్టోబర్ నెలలో ఈ సేల్ ప్రారంభం కానుంది.
ఫ్లిప్‌కార్ట్ కచ్చితమైన తేదీని వెల్లడించనప్పటికీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్ (Flipkart Sale Date) అక్టోబర్ 4న లైవ్ కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్ పోస్ట్ ప్రకారం.. నథింగ్ ఫోన్ (1) ధర రూ. 23,000కి తగ్గుతుంది. తగ్గింపు ధర బ్యాంక్ ఆఫర్‌తో సహా ఉందా లేదా కంపెనీ ఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుందా? అనేది స్పష్టంగా తెలియదు.
నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్‌లు :
నథింగ్ ఫోన్, 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫీచర్ల పరంగా పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంది. మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం హాప్టిక్ టచ్ మోటార్‌లను కలిగి ఉంటుంది. స్పష్టమైన విజువల్స్ HDR10+కి సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్, బ్యాక్ ప్యానెల్‌లలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ అందిస్తుంది.
ఈ డిస్‌ప్లే యూజర్లకు ఆహ్లాదకరమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను Qualcomm Snapdragon 778+ SoC పర్పార్మెన్స్ బలమైన ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 12GB RAMతో మల్టీ టాస్కింగ్, డిమాండ్ ఉన్న అప్లికేషన్‌లను సులభంగా రన్ చేయగలదు. అదనంగా, ఈ నథింగ్ ఫోన్ డివైజ్ 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో విస్తారమైన స్టోరేజీని అందిస్తుంది.
Flipkart Big Billion Days Nothing Phone 1 price
రోజంతా ఛార్జింగ్.. ఫుల్ బ్యాటరీ సామర్థ్యం :
నథింగ్ ఫోన్ చెప్పుకోదగ్గ ఫీచర్లలో ఒకటి 4500mAh బ్యాటరీ.. సింగిల్ ఛార్జ్ చేయడం ద్వారా రోజుంతా ఛార్జింగ్ వస్తుంది. ఇంకా ఏమిటంటే, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అత్యవసర సమయాల్లో వేగంగా బ్యాటరీని ఫుల్ చేయగలదు. అయితే, ప్యాకేజ్‌లో ఛార్జర్ అందించడం లేదని గమనించాలి. ఈ నథింగ్ ఫోన్ (1) స్మార్ట్‌ఫోన్ 3 విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
వినియోగదారులకు తమ ప్రాధాన్యతల ఆధారంగా ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈ వేరియంట్‌లలో 128GB లేదా 256GB స్టోరేజ్‌తో 8GB RAM, అలాగే 12GB RAM, 256GB స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ ఆప్షన్ ఉన్నాయి. వినియోగదారులు తమ స్టోరేజీ, పర్ఫార్మెన్స్ అవసరాలకు సరిపోయే కాన్ఫిగరేషన్‌ను ఎంచుకోవచ్చు.