Nothing Phone 2 available for Rs 39999 after discount _ 10 things to keep in mind before buying
Nothing Phone (2) Discount : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (2) (Nothing Phone (2) శుక్రవారం (జూలై 21) ఈరోజు నుంచి ఓపెన్ సేల్‌లో అందుబాటులోకి సిద్ధంగా ఉంది. ఈ సేల్ 12PM నుంచి ప్రారంభమైంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు, నథింగ్ కంపెనీ సెకండ్-జెనరేషన్ ఫోన్‌కు గత మోడల్ కన్నా చాలా ఎక్కువ ధరను నిర్ణయించలేదు. నథింగ్ ఫోన్ (2) అధికారికంగా భారత మార్కెట్లో ధర రూ. 44,999 నుంచి ప్రారంభమవుతుంది. గత ఏడాదిలో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) కన్నా రూ. 5వేలు ఎక్కువ ఉంది. కానీ, లాంచ్ ఆఫర్‌లో భాగంగా నథింగ్ ఫోన్ (2) ప్రస్తుతానికి, బ్యాంక్ ఆఫర్‌లతో తర్వాత రూ. 39999 తగ్గింపు ధరకు పొందవచ్చు.
అధికారిక ధర విషయానికొస్తే.. నథింగ్ ఫోన్ (2) బేస్ మోడల్‌కు రూ. 44,999 నుంచి ప్రారంభమవుతుంది. నథింగ్ ఫోన్ మొత్తం 3 వేరియంట్‌లలో వస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజీ, 12GB RAM + 256GB స్టోరేజీ, 12GB RAM + 512GB స్టోరేజీతో వస్తుంది. బేస్ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 44,999, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 49,999, టాప్-ఎండ్ మోడల్ 12GB RAM + 512GB స్టోరేజ్ రూ. 54,999కు సొంతం చేసుకోవచ్చు.
ఇప్పుడు, లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. కంపెనీ, ఫ్లిప్‌కార్ట్ రూ. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించడానికి సిటీ, HDFC, యాక్సిస్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. అదనంగా, మరో రూ. 2వేలు డిస్కౌంట్ కస్టమర్‌లు పొందవచ్చు. నథింగ్ ఫోన్ ఆఫర్లతో బేస్ మోడల్ ధర రూ.39,999కి తగ్గుతుంది. మిగిలిన 2 వేరియంట్‌లకు కూడా తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్నాయి. నథింగ్ ఫోన్ (2)ని కొనుగోలు చేయాలనుకుంటే.. మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఓసారి పరిశీలిద్దాం..
Nothing Phone 2 available for Rs 39999 after discount
నథింగ్ ఫోన్ (2) మోడల్, నథింగ్ ఫోన్ (1)తో పోలిస్తే ఇతర ఫీచర్లు మినహా భిన్నమైన డిజైన్‌ను అందిస్తుంది. నథింగ్ ఫోన్ (2)లో గ్లిఫ్ ఫాట్రన్స్ (glyph patterns), బ్యాక్ లైట్లను ఉపయోగించే విధానం, మొత్తం ఫారమ్ ఫ్యాక్టర్ చాలా భిన్నంగా ఉంటాయి. ఫ్రంట్ డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. డిస్ప్లే సెంటర్ టాప్‌లో ఒక పంచ్ హోల్ ఉంది. గత ఫోన్ మోడల్ మాదిరిగా బెజెల్స్ కూడా చాలా సన్నగా ఉంటాయి.
బ్యాక్‌సైడ్ ఫోన్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందించే కర్వ్డ్ గ్లాస్ ఉంటుంది. అయితే, గ్లాస్ ఫోన్‌ను కొంచెం కింది జారినట్టుగా ఉంటుంది. నథింగ్ ఫోన్ (1)తో పోల్చినప్పుడు.. నథింగ్ ఫోన్ (2) భారీ డిస్‌ప్లేను అందిస్తుంది. నథింగ్ ఫోన్ (2) 1080*2412 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. నథింగ్ ఫోన్ (2) చాలా శక్తివంతమైన చిప్‌సెట్‌పై కూడా రన్ అవుతుంది. నథింగ్ ఫోన్ (2) మోడల్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
కెమెరా పరంగా కూడా కొంచెం మెరుగుదలతో వస్తుంది. నథింగ్ ఫోన్ (2) మోడల్ 50MP Sony IMX890 సెన్సార్ + 50MP Samsung JN1 సెన్సార్‌తో సహా డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో కూడా మెరుగుదల ఉంది. నథింగ్ ఫోన్ (2) సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32MP Sony IMX615 సెన్సార్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యం కూడా చాలా పెద్దదిగా ఉంది. నథింగ్ ఫోన్ (2) మోడల్ 4700mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. నథింగ్ ఫోన్ (2) బాక్స్‌లో ఛార్జర్‌తో రాలేదని గమనించాలి. కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్ మాత్రమే ఉంది. లేటెస్ట్ నథింగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS ఆధారంగా కొత్త నథింగ్ OS 2.0లో రన్ అవుతుంది. నథింగ్ ఫోన్ (2) మొత్తం 3 ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను కూడా అందించడం లేదు.
Read Also : Nothing Phone 2 First Sale : వచ్చే వారమే నథింగ్ ఫోన్ (2) ఫస్ట్ సేల్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? 4 కారణాలివే..!