×
Ad

Nothing Phone 3a Lite : బడ్జెట్-ఫ్రెండ్లీ అవతార్ నథింగ్ ఫోన్ 3a లైట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. మీ బడ్జెట్‌ ధరలోనే..?

Nothing Phone 3a Lite : నథింగ్ ఫోన్ 3a లైట్ వెర్షన్ రాబోతుంది. ట్రాన్స్ పరంట్ డిజైన్, డైమన్షిటీ 7300 ప్రో వంటి ఫీచర్లతో లాంచ్ కానుంది.. పూర్తి వివరాలివే..

Nothing Phone 3a Lite

Nothing Phone 3a Lite : నథింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారతీయ మార్కెట్లోకి నథింగ్ బ్రాండ్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. పాపులర్ నథింగ్ 3a సిరీస్ బడ్జెట్-ఫ్రెండ్లీ అవతార్ నథింగ్ ఫోన్ 3a లైట్ వచ్చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 27న అధికారికంగా భారత్‌లో రిలీజ్ కానుందని బ్రాండ్ ధృవీకరించింది. నథింగ్ ఫోన్ 3a లైట్ వెర్షన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లాంచ్ తేదీ, లభ్యత, కలర్ ఆప్షన్లు :
నథింగ్ ఫోన్ 3a లైట్ ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన (Nothing Phone 3a Lite) ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి రానుంది. గ్లోబల్ ఎడిషన్ కలర్ ప్యాలెట్‌కు సపోర్టుతో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలో నథింగ్ సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ గ్లిఫ్ LED ఇంటర్‌ఫేస్ ఉన్నాయి.

కంపెనీ ఇంకా భారతీయ మార్కెట్ ధరను వెల్లడించనప్పటికీ, 128GB వేరియంట్ గ్లోబల్ ధర EUR 249 (సుమారు రూ. 25,600) నుంచి ప్రారంభమవుతుంది. 256GB మోడల్ కోసం EUR 279 (సుమారు రూ. 28,700) వరకు ఉంటుంది. భారత మార్కెట్లో ధర రూ. 24వేలు నుంచి రూ. 28వేల మధ్య తగ్గే అవకాశం ఉంది.

Read Also : Android Camera Phones : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌‌ను తలదన్నేలా 5 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు.. హైక్వాలిటీ ఫొటోలతో కిసిక్ అంతే..!

హైరిఫ్రెష్ రేట్‌తో ట్రాన్స్‌పరంట్ బ్యాక్ ప్యానెల్ :
నథింగ్ ఫోన్ 3a లైట్ ప్రీమియం డిజైన్‌ కలిగి ఉంటుంది. 6.77-అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లేతో 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ నథింగ్ ఫోన్ దాదాపు బెజెల్-లెస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ నథింగ్ ఫోన్ 3a డివైజ్ ప్రీమియంగా కనిపించేలా ఉంటుంది. అలాగే, గేమింగ్‌కు, ఎక్కువసేపు చూసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను స్క్రోల్ చేసేందుకు వీలుగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్, కోర్ డైమెన్సిటీ 7300 ప్రో వెర్షన్ :

4nm ఫ్యాబ్రికేషన్ ప్రక్రియపై మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రో చిప్‌సెట్ కలిగి ఉంది. పవర్ పరంగా మల్టీ టాస్కింగ్‌ అందిస్తుంది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజీని కలిగి ఉంది. అదనంగా 2TBకి సపోర్టుతో మైక్రో SD కార్డ్ స్లాట్, ప్లస్‌తో రానుంది. ఐకానిక్ గ్లిఫ్ లైట్ ఇంటర్‌ఫేస్ మెయిన్ హైలైట్‌లలో ఒకటి. LED-ఆధారిత నోటిఫికేషన్‌లు, ఛార్జింగ్ ఇండికేషన్లు, కస్టమైజడ్ రింగ్‌టోన్‌లను అందిస్తుంది.

50MP మెయిన్ షూటర్‌తో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్

  • నథింగ్ ఫోన్ 3a లైట్ ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌
  • 50MP ప్రైమరీ కెమెరా: f/1.88
  • 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ (f/2.2)
  • డెప్త్ సెన్సార్
  • నథింగ్ ఫోన్ ఫ్రంట్ సైడ్ క్లీన్ హోల్-పంచ్ కటౌట్ లోపల 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు ఇయర్‌బడ్‌లు లేదా ఏదైనా ఇతర అప్లియన్సెస్ హ్యాండ్‌సెట్ నుంచి నేరుగా ఛార్జ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. రాబోయే నథింగ్ ఫోన్ 3a లైట్ ధర ఎంత ఉంటుందో క్లారిటీ లేదు. ట్రాన్స్‌పరెన్స్ డిజైన్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, స్ట్రాంగ్ బ్యాటరీ, కొత్త మీడియాటెక్ చిప్‌సెట్‌తో వస్తుంది. ధర పరంగా అత్యంత స్టైలిష్ పర్ఫార్మెన్స్-సెంట్రలైజడ్మిడ్-రేంజర్‌లలో ఒకటి కావచ్చు.