Nothing Phone 4a : వారెవ్వా.. ఈ నథింగ్ ఇంతకన్నా తక్కువ ధరకు దొరకదు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Nothing Phone 4a : నథింగ్ అభిమానకు కిర్రాక్ న్యూస్.. నథింగ్ ఫోన్ 4ఎ చౌకైన ధరకే లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Nothing Phone 4a : కొత్త నథింగ్ ఫోన్ కావాలా? అయితే ఈ ఆఫర్ మీకోసమే.. ఎప్పటినుంచి నథింగ్ ఫోన్ కొందామని చూసేవారికి ఇదే అద్భుతమైన అవకాశం.. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. నథింగ్ అన్ని ప్లాట్ ఫారాల్లో తక్కువ ధరకే లభించదు.

కొత్త నథింగ్ ఫోన్ కొనుగోలు చేసేవారికి ఇంతకన్నా ఆఫర్ మళ్లీ రాకపోవచ్చు. వాస్తవానికి, నథింగ్ ఈ ఏడాది మార్చిలో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 4aను లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.

ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్ ఈ నథింగ్ ఫోన్‌ను భారీ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తగ్గుతుంది. నథింగ్ ఫోన్ 4a డిస్కౌంట్, ఆఫర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

నథింగ్ ఫోన్ 4a ధర ఆఫర్లు :
నథింగ్ ఫోన్ 4a ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ రిలయన్స్ డిజిటల్లో రూ.34,999 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ విషయానికొస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్లు చేస్తే రూ.2,624 డిస్కౌంట్ పొందవచ్చు. అసలు ధర రూ.32,374 అవుతుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 4aలో 1224x2720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఎస్ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5400mAh బ్యాటరీ ఉంది.

కెమెరా సెటప్ పరంగా నథింగ్ ఫోన్ 4a బ్యాక్ సైడ్ ఎఫ్/1.88 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, NFC, GPS, సింగిల్ యూఎస్బీ టైప్-C పోర్ట్ ఉన్నాయి.
