×
Ad

Nothing Phone 4a Pro : 5,080mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో నథింగ్ ఫోన్ 4a ప్రో వచ్చేస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్..

Nothing Phone 4a Pro : నథింగ్ ఫోన్ 4a ప్రో అతి త్వరలో లాంచ్ కానుంది. లాంచ్ కు ముందే బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్, ఐపీ రేటింగ్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి..

Nothing Phone 4a Pro

  • నెక్స్ట్ జనరేషన్ నథింగ్ ఫోన్ 4a ప్రో లాంచ్ వివరాలు
  • నథింగ్ ఫోన్ 4a,నథింగ్ ఫోన్ 4a ప్రో బ్యాటరీ, ఐపీ రేటింగ్ లీక్
  • IP65 రేటింగ్‌, 5,080mAh వరకు బ్యాటరీతో రావొచ్చు
  • నథింగ్ ఫోన్ 4a ప్రో 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు

Nothing Phone 4a Pro : నథింగ్ ఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. టెక్ బ్రాండ్ నథింగ్ నుంచి సరికొత్త సిరీస్ రాబోతుంది. నెక్ట్స్ జనరేషన్ నథింగ్ ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే గత మార్చిలో నథింగ్ ఫోన్ (3a), నథింగ్ ఫోన్ (3a) ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ కాగా మరో కొత్త సిరీస్ లాంచ్ చేయనుంది. ఇందులో నథింగ్ ఫోన్ 4a, నథింగ్ ఫోన్ 4a ప్రో ఉన్నాయి. రాబోయే నథింగ్ ఫోన్లకు సంబంధించి లాంచ్ టైమ్ లైన్ ఎప్పుడు అనేది కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

కానీ, ఈ ఫోన్లలో నథింగ్ ఫోన్ 4a ప్రో మోడల్ మాత్రం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ సైటులో లిస్ట్ అయింది. ఈ నథింగ్ ప్రో ఫోన్ A069 మోడల్ నంబర్‌తో సర్టిఫై అయింది.

అయితే, ఈ ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కూడా రివీల్ చేయలేదు. అతి త్వరలో భారత మార్కెట్లోకి కూడా ఈ నథింగ్ కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. యూరోపియన్ సర్టిఫికేషన్ సైట్‌లో (EPREL) ఎనర్జీ లేబుల్ లిస్టింగ్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ కనిపించింది.

Read Also : MacBook Air M4 Price : బ్లింకిట్‌లో బంపర్ డిస్కౌంట్.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 రూ.80,499కే.. జస్ట్ 20 నిమిషాల్లోనే హోం డెలివరీ..!

నథింగ్ ఫోన్ రేటింగ్ బ్యాటరీ సామర్థ్యం రివీల్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,200mAh నుంచి 5,080mAh వరకు బ్యాటరీతో లాంచ్ కావచ్చు. నథింగ్ ఫోన్ 3a ప్రో 5,000mAh బ్యాటరీతో లాంచ్ అయింది. లిస్టింగ్ ప్రకారం.. నథింగ్ ఫోన్ 4a ప్రో కూడా 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానుంది. నథింగ్ ఫోన్ 4a ప్రో IP65 రేటింగ్‌తో వస్తుందని అంచనా. నథింగ్ ఫోన్ 3a ప్రో కూడా IP64 రేటింగ్‌తో వచ్చింది.

నథింగ్ ఫోన్ 4A ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనా) :

ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గత మోడల్ నథింగ్ ఫోన్ 3A ప్రో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందింది. ఈ ఫోన్ 4A ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది.

లీక్‌ల ప్రకారం.. నథింగ్ ఫోన్ (4a) ప్రో 12GB ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో 256GB వరకు స్టోరేజ్‌తో రావొచ్చు. eSIM సపోర్టు కూడా ఉంటుంది. ఈ నథింగ్ ఫోన్ బ్లాక్, వైట్, రోజ్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండొచ్చు.

నథింగ్ ఫోన్ (3a) ప్రో విషయానికి వస్తే..

ఈ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000Hz గేమింగ్ మోడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల FullHD+ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లేతో వచ్చింది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, పాండా గ్లాస్‌ కూడా ఉంది. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ఓఎస్ 3.1పై రన్ అవుతుంది.

ఏఐ ఫీచర్లలో క్వాల్కమ్ హెక్సాగాన్ NPU ఇన్‌స్టాల్ అయింది. ఫొటోగ్రఫీ పరంగా నథింగ్ ఫోన్ (3A) ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, ఎఫ్/1.88 అపెర్చర్‌తో 50MP శాంసంగ్ OIS సెన్సార్, ఎఫ్/2.55 అపెర్చర్‌తో 50MP సోనీ పెరిస్కోప్ లెన్స్, ఎఫ్/2.2 అపెర్చర్, 120° FOVతో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ 50MP సెల్ఫీ కెమెరాకు సపోర్టు ఇస్తుంది. ప్రస్తుతం ఈ నథింగ్ ఫోన్ రూ.29,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.