Nothing will soon allow Android users to send iMessages
Nothing Chats App : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ కంపెనీ కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ నథింగ్ చాట్స్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ యూజర్ల కూడా ఆపిల్ ఐమెసేజ్‌లు వంటి ఫీచర్‌లను పంపుకునేందుకు అనుమతినిస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన పనిలేకుండా ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల మధ్య ఐమెసేజ్‌లు పంపుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
ఆపిల్ ఐమెసేజ్ వంటి ఫీచర్లను ప్రత్యేకంగా ఐఫోన్లలో అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ యూజర్లకు అందించే మొదటి ఆండ్రాయిడ్ బ్రాండ్ ఏదీ లేదు. లండన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు నథింగ్ ఫోన్ (2) వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నథింగ్ చాట్స్ అనే కొత్త మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రకటించింది.
Nothing Android users
ఆండ్రాయిడ్‌లో ఇతర ఐమెసేజ్ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారంలపై యూజర్లు ఆధారపడకుండా ఉండేలా ఈ కొత్త యాప్ తీసుకొచ్చింది. నవంబర్ 17వ తేదీ నుంచి నథింగ్ ఫోన్ (2) యూజర్లు తమ ఫోన్లలో (iMessage) అనే బ్లూ కలర్ బబుల్స్ పొందవచ్చు. ఐఫోన్ యూజర్లతో ఈజీగా మెసేజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్లకు మధ్య ఐమెసేజ్‌లు పంపుకునే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు తప్పనిసరిగా సన్‌బర్డ్‌ను విశ్వసించాలని నథింగ్ కంపెనీ పేర్కొంది.
సంస్థ ప్రకారం.. సన్‌బర్డ్ ఆర్కిటెక్చర్ యూజర్ల మధ్య మెసేజ్‌లను ఎలాంటి మధ్యవర్తిత్వ సర్వర్‌లలో స్టోర్ చేయకుండా నేరుగా పంపిణీ చేసేలా రూపొందించింది. అయినప్పటికీ, ఐమెసేజ్‌లను సన్‌బర్డ్ యూజర్ లొకేషన్ ఆధారంగా అమెరికా లేదా యూరప్‌లో ఉన్న (Mac Mini)లో ఎన్‌క్రిప్టెడ్ డేటాబేస్‌లో యూజర్ ఐక్లౌడ్ ఆధారాలను తాత్కాలికంగా స్టోర్ చేస్తుంది. ఈ ఆధారాలు యాప్ ద్వారా పంపిన ఐమెసేజ్ కోసం రిలేగా పనిచేస్తాయి. రెండు వారాల ఇన్‌యాక్టివ్ తర్వాత, సన్‌బర్డ్ ఈ అకౌంట్ సమాచారాన్ని సురక్షితంగా డిలీట్ చేస్తుందని నథింగ్ పీఆర్ ఇమెయిల్ ద్వారా వివరించారు.
నథింగ్ చాట్స్ యాప్ బ్లూ బబుల్స్ ద్వారా మెసేజ్‌లను పంపుకునేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. భవిష్యత్తులో అదనపు ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ముందుగా నోటిఫికేషన్‌ల కోసం సైన్ అప్ చేయడం ద్వారా యూజర్లు అప్‌డేట్‌లపై ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నథింగ్ చాట్స్ ఐమెసేజ్‌లతో యాప్‌ను సెటప్ చేయాలంటే యూజర్లు తమ సంబంధిత ఆపిల్ ఐడీతో లాగిన్ చేయాలి. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని చాట్‌లు సన్‌బర్డ్ ప్రైవసీ విధానానికి అనుగుణంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను నిర్వహిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
Nothing Android users send iMessages
యూట్యూబ్ వీడియోలో నథింగ్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు కార్ల్ పీ యాప్ ఫీచర్‌లపై మరిన్ని విషయాలను రివీల్ చేశారు. ఈ యాప్ ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత నథింగ్ చాట్స్ వ్యక్తిగత, గ్రూపు మెసేజ్‌లకు సందేశాలకు సపోర్టు ఇస్తాయని ఆయన చెప్పారు. టైపింగ్ ఇండికేటర్‌లు, ఫుల్-సైజ్ మీడియా షేరింగ్, వాయిస్ నోట్స్ వంటి ఫీచర్‌లతో అనుబంధంగా ఉంటాయని తెలిపారు. రీడ్ రీసిప్ట్, మెసేజ్ రియాక్షన్‌లు, మెసేజ్ రిప్లయ్ మొదట్లో అందుబాటులో ఉండవు. భవిష్యత్తులో రాబోయే అప్‌డేట్‌లలో చేర్చనున్నట్టు క్లార్ పీ చెప్పారు.
నథింగ్స్ చాట్స్ లభ్యత ఎప్పటినుంచంటే? :
నథింగ్ చాట్స్ యాప్ నవంబర్ 17న ప్రారంభం కానుంది. మొదట ఉత్తర అమెరికా, ఈయూ, ఇతర యూరోపియన్ దేశాల్లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ నథింగ్ చాట్స్ యాప్ ప్రారంభంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కానుంది. ఇతర దేశాలకు లేదా పాత నథింగ్ ఫోన్ (1) మోడల్‌లకు ఎప్పుడు విస్తరించనుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అదనంగా, యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండదు. నథింగ్ నుంచి ప్రత్యేకమైన ఆఫర్ అందించనుంది. అప్పుడు మాత్రమే ఈ యాప్ యాక్సస్ చేసుకునే వీలుంటుంది.