Electricity Meter Scan : మీ ఇంటి కరెంటు రీడింగ్ మీరే తీయండి.. బిల్లు చెల్లించండి!

కరోనా పరిస్థితుల్లో నగదు చెల్లింపులన్నీ డిజిటల్‌లోనే జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే APEPDCL విద్యుత్ సంస్థ విన్నత్నంగా ఆలోచించి ఓ సరికొత్త యాప్ ప్రవేశపెట్టింది. 

Power Meter Scan Bill : కరోనా పరిస్థితుల్లో నగదు చెల్లింపులన్నీ డిజిటల్‌లోనే జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే APEPDCL విద్యుత్ సంస్థ విన్నత్నంగా ఆలోచించి ఓ సరికొత్త యాప్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త యాప్ ద్వారా మీ ఇంట్లో విద్యుత్ మీటర్ రీడింగ్ మీరే స్కాన్ చేయొచ్చు. ఇంట్లో నుంచే కరెంట్ బిల్లు చెల్లించవచ్చు. దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సిందేమి లేదంటోంది..

మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అంటోంది విద్యుత్ సంస్థ.. APEPDCL యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. ఎంచక్కా మీటరు రీడింగ్ స్కాన్ చేసి బిల్లు చెల్లించవచ్చు. ఈ విధానం గత నెల నుంచే వినియోగంలోకి వచ్చింది.

మీటరు రీడింగ్ తీసే తేదీని ముందుగానే సదరు బిల్లుపై ప్రచురిస్తుండంతో ప్రతినెల అదే తేది మీటరు రీడింగ్ తీయాల్సి ఉంటుంది. కరోనా కాలంలో విద్యుత్తు శాఖ వినియోగదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుంది.

ఎక్కువ మందికి చేరువయ్యేలా చేసేందుకు దీనిపై మరింత అవకాశం కల్పించాల్సి ఉంది. గత నెలలో ఈ విద్యుత్ సంస్థ పరిధిలో 2,49,681 మంది వినియోగదారులు ఈ యాప్‌ను వినియోగించారు. ఈ యాప్ సేవలను మరింత విస్తృత పరిచేందుకు APEPDCL వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు