×
Ad

UPI One World Wallet : డాలర్లతో పనిలేదు.. ఫారెన్ గెస్టులకు ఇండియాలో పేమెంట్స్ ఈజీ.. UPI స్కాన్ చేస్తే చాలు.. ఎలా వాడాలంటే?

UPI One World Wallet : వన్ వరల్డ్ అనేది ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) వ్యాలెట్. విదేశీ ప్రయాణికులు న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు లేదా భారత్ మండపంలోని NPCI పెవిలియన్‌లో పొందవచ్చు. భారతీయ సిమ్ కార్డ్ అవసరం లేదు.

  • Published On : February 16, 2026 / 02:27 PM IST

UPI One World Wallet

  • భారత్‌లో విదేశీ అతిథులకు ఇప్పుడు ఒక్క స్కాన్ చాలు
  • ఇండియాలో షాపింగ్, ఫుడ్, ట్రావెల్ అన్నీ ఒకే QRతో పేమెంట్స్
  • ఫారిన్ టూరిస్టులకు ఇండియాలో డిజిటల్ వ్యాలెట్ యాప్
  • 40కిపైగా దేశాల నుంచి వచ్చే అతిథులకు అవకాశం

UPI One World Wallet : విదేశీయులకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ భారతీయులే కాదు.. విదేశీయులు కూడా భారత్ కు వచ్చినప్పుడు ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు. విదేశీ అతిథుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సర్వీసును విస్తరించింది.

భారత డిజిటల్ విప్లవం ఇకపై భారతీయులకే పరిమితం కాదు. ఇతర దేశాల అతిథులకు కూడా అందుబాటులో ఉంటుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా 40 కన్నా ఎక్కువ దేశాల నుంచి వచ్చే అతిథులు భారతీయ బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్ నంబర్ లేకుండా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు.

విదేశీ అతిథుల కోసం NPCI ‘యూపీఐ వన్ వరల్డ్’ వాలెట్ సర్వీసును ప్రారంభించింది. భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులు యూపీఐ ఉపయోగించి దేశంలో అన్ని ఆన్ లైన్ పేమెంట్లు చేసుకోవచ్చు. క్యాష్, విదేశీ కరెన్సీ ఎక్స్ఛేంజ్ వంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు, మనలాగే విదేశీయులు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా రియల్-టైమ్ పేమెంట్లు చేయవచ్చు.

యూపీఐ వన్ వరల్డ్ వ్యాలెట్ ఏంటి? :
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) వ్యాలెట్. విదేశీ ప్రయాణికులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో లేదా భారత్ మండపం వద్ద NPCI పెవిలియన్‌లో ఈజీగా పొందవచ్చు. భారతీయ సిమ్ కార్డ్ అవసరం లేదు. సేఫ్ డిజిటల్ వ్యాలెట్.

Read Also : AI Impact Summit 2026 : ఇండియా ఫస్ట్ వరల్డ్ AI ఇంపాక్ట్ సమ్మిట్.. రిజిస్ట్రేషన్ ఎలా? ఫుల్ షెడ్యూల్.. మీ ఫోన్లలో లైవ్ చూడొచ్చు!

విదేశీ ప్రయాణికులు తమ అంతర్జాతీయ కార్డుల నుంచి కూడా క్యాష్ లోడ్ చేసుకోవచ్చు. ట్రిప్ చివరిలో వ్యాలెట్ ఫండ్స్ మిగిలి ఉంటే నిబంధనల ప్రకారమే ఆ డబ్బును తిరిగి ఒరిజినల్ అకౌంటుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

NPCI డేటా ప్రకారం.. గత జనవరి 2026లో యూపీఐ రూ.28.33 లక్షల కోట్ల (సుమారు 312 బిలియన్ డాలర్లు) విలువైన 21.70 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ ఎన్‌పీసీఐ దేశంలో రిటైల్ పేమెంట్లను నిర్వహిస్తుంది. ఈ పోర్ట్‌ఫోలియోలో UPI, RuPay, IMPS, NACH, AePS వంటి ప్రొడక్టులు ఉన్నాయి.

యూపీఐ వన్ వరల్డ్‌ ఎలా వాడాలంటే? :

  • ఈ సర్వీసు విదేశీ అతిథులకు చాలా ఈజీగా ఉంటుంది.
  • ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి CheqUPI యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • పేరు, ఇమెయిల్, పాస్‌పోర్ట్/వీసా వంటి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • యాప్‌లో సెల్ఫీ తీసుకుని మీ ప్రత్యేకమైన యూపీఐ పిన్‌ సెట్ చేసుకోండి.
  • మీ అంతర్జాతీయ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బును లోడ్ చేయండి
  • మీ డిజిటల్ వ్యాలెట్ రెడీ.. ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు.

లావాదేవీ పరిమితి ఎంతంటే? :
అతిథుల సౌలభ్యం కోసం ఈ యూపీఐ వన్ వరల్డ్ వాలెట్ ప్రతి లావాదేవీకి రూ. 25వేల వరకు లోడ్ చేసుకోవచ్చు. గరిష్టంగా నెలవారీ లోడింగ్ లిమిట్ రూ. 50వరకు ఉంటుంది. భారత డిజిటల్ సిస్టమ్ ప్రపంచానికి అందించడమే కాకుండా “అతిథి దేవో భవ” అనే సంప్రదాయాన్ని మోడ్రాన్ టెక్నాలజీతో ఒకటి చేస్తుంది.

“యూపీఐ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో విదేశీ అతిథులకు ‘యూపీఐ వన్ వరల్డ్’ సర్వీసును విస్తరించింది. భారత రియల్-టైమ్ పేమెంట్ ఎన్విరాన్ మెంట్ సిస్టమ్, ‘మేడ్ ఇన్ ఇండియా’ టెక్నాలజీని యాక్సస్ చేసే అవకాశాన్ని విదేశీయులకు అందిస్తున్నాం” అని NPCI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (గ్రోత్) సోహిని రాజోలా అన్నారు.