Nubia NaviX Ultra Launch : స్మార్ట్‌ఫోన్ కాదు.. AI ఏజెంట్ ఫోన్ అంటున్న నుబియా.. జూలై 17నే గ్రాండ్ లాంచ్..!
Nubia NaviX Ultra Launch : ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలోని షాంఘైలో జూలై 17న ప్రారంభమయ్యే వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌లో లాంచ్ చేయనున్నారు. నుబియా నావిక్స్ అల్ట్రా వైట్, పర్పల్, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.
- Sreehari A
- Published on- July 16, 2026 / 07:37 PM IST
Nubia NaviX Ultra Launch
- అడ్వాన్స్ ఏఐ సిస్టమ్ లింక్ అయ్యే ఫస్ట్ డివైజ్ ఇదే కావచ్చు
- నావిక్స్ అల్ట్రాలో డూబావో ఏఐ అసిస్టెంట్ అమర్చారు
- వరల్డ్ ఏఐ సదస్సులో ఈ కొత్త నుబియా అల్ట్రా లాంచ్
Nubia NaviX Ultra Launch : చైనా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం జెడ్‌టీఈ సబ్-బ్రాండ్ నుబియా నుంచి సరికొత్త ఏఐ ఫోన్ వచ్చేస్తోంది. ఈ వారం ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్ నావిక్స్ అల్ట్రాను లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ ముందుగానే టీజ్ చేసింది.
నుబియా నావిక్స్ అల్ట్రాలో డౌబావో ఏఐ అసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్యాప్సల్ ఆకారంలో ఉండే రియర్ కెమెరా ఐలాండ్, కింద ఫ్లాష్ ఉన్నాయి. నుబియా నావిక్స్ అల్ట్రా పక్కన ఆరెంజ్ కలర్ బటన్ కూడా ఉంది. ఈ బటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన ఫీచర్లను యాక్సెస్ చేయొచ్చు.
ఈ నెల 17నే నుబియా కొత్త ఫోన్ లాంచ్ :
నుబియా ఫస్ట్ ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్ నావిక్స్ అల్ట్రా లాంచ్ ప్రకటించింది. చైనాలోని షాంఘైలో జూలై 17న ప్రారంభమయ్యే వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నారు. నుబియా నావిక్స్ అల్ట్రా వైట్, పర్పల్, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ టీజర్‌లో క్యాప్సల్ షేప్ బ్యాక్ కెమెరా ఐలాండ్, కింద ఫ్లాష్ కనిపిస్తున్నాయి. నుబియా నావిక్స్ అల్ట్రా పక్కన నారింజ కలర్ బటన్ ఉంది. ఈ బటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన ఫీచర్లను యాక్సెస్ చేసేందుకు వాడొచ్చు.
స్పెషిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
అయితే, ఈ బటన్ పర్ఫార్మెన్స్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ కనిపిస్తోంది. నావిక్స్ అల్ట్రాలో డూబావో ఏఐ అసిస్టెంట్‌ను అమర్చనున్నట్లు నుబియా తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర, లభ్యత వివరాలు ఇంకా వెల్లడించలేదు.
నుబియా ప్రెసిడెంట్ ప్రకారం..
కంపెనీ భారీ లెవల్ ఏఐ ఏజెంట్ మోడల్ కోసం అప్లయ్ చేసిందని వెల్లడించారు. నుబియా నావిక్స్ అల్ట్రా ఈ అడ్వాన్స్ ఏఐ సిస్టమ్ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ఫోన్ కానుంది. వినియోగదారులకు అతి కష్టమైన పనులను కూడా ఈజీగా పూర్తి చేయగలదు. మెరుగైన ఏజెంటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఇందులో బైట్‌డాన్స్ వారి డౌబావో మొబైల్ అసిస్టెంట్ కూడా ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ కేవలం ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడమే కాదు.. టెక్స్ట్ టైపింగ్, ఇతర యాప్‌లలో మల్టీ ఫేస్ టాస్కులను ఆటోమాటిక్‌గా పూర్తి చేయగలదు. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్, గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ అయిన నుబియా M153 స్థానంలో రానుంది. నుబియా M153 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా.
