Offline Payments : ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్… ఆఫ్‌లైన్ పేమెంట్లపై రూ. 200 లిమిట్..!

అంతా ఆన్‌లైన్‌లోనే. .డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంలు అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ పేమెంట్స్ మరీ ఎక్కువగా పెరిగిపోయాయి. ఆన్ లైన్ యూజర్లు ఎక్కువ యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేస్తున్నారు.

RBI Framework Offline Payments : అంతా ఆన్‌లైన్‌లోనే. .డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంలు అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ పేమెంట్స్ మరీ ఎక్కువగా పెరిగిపోయాయి. ఆన్ లైన్ యూజర్లు ఎక్కువ యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఆన్‌లైన్ పేమెంట్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ సదుపాయం ఉండాల్సిందే. ఇంటర్నెట్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఆఫ్ లైన్ పేమెంట్స్ ఒక్కటే మార్గం.. అదే ఆప్‌లైన్ పేమెంట్స్ చేయాలంటే.. ఇంటర్నెట్ లేదా టెలికం కనెక్టవిటీ అవసరం లేదు. అందుకే ఆఫ్‌లైన్ పేమెంట్స్ కోసం.. భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రవేశపెట్టింది.

దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను ఆర్బీఐ తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఆఫ్‌లైన్‌ నగదు పేమెంట్ల కోసం కొత్త ఫ్రేమ్‌ వర్క్‌‌ను సోమవారం విడుదల చేసింది. 2020 ఆగస్టులోనే ఆర్‌బీఐ ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ను పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే ఈ పైలట్‌ ప్రాజెక్టు మార్చి 31, 2021 వరకు కొనసాగింది. సుమారు రూ. 1.16 కోట్ల విలువైన 2.41 లక్షల ఆఫ్‌లైన్‌ ట్రాన్సాక్షన్లను ఆర్బీఐ టెస్టింగ్ నిర్వహించింది. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం.. ఆఫ్ లైన్ పేమెంట్లపై లిమిట్ రూ.200 గరిష్టంగా ఉండనుంది.

తక్కువ విలువ కలిగిన రిటైల్‌ ట్రాన్సాక్షన్ల కార్డులు, మొబైల్‌ టూల్స్ ద్వారా ఆఫ్‌లైన్‌ ట్రాన్సాక్షన్లను జరుపుకోవచ్చు. ఈ పేమెంట్స్‌ కేవలం ఫేస్ టు ఫేస్ జరుగుతాయి. ఆఫ్‌లైన్ పేమెంట్స్‌ గరిష్ట లావాదేవీ పరిమితి రూ. 200 మాత్రమేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ లావాదేవీల మొత్తం లిమిట్.. సాధారణంగా ఏ సమయంలోనైనా రూ. 2,000గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయాలంటే మాత్రం కచ్చితంగా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను ఉపయోగించాలి. ఎలాంటి అథనిటికేషన్‌ లేకుండా నిర్ణీత లిమిట్ వరకు ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ చేసుకోవచ్చు.

Read Also : Fire Two-Wheeler : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు.. వాహనానికి నిప్పుపెట్టాడు

ట్రెండింగ్ వార్తలు