Ola to Showcase its Electric Motorcycle Portfolio at MotoGP Bharat
MotoGP Bharat Ola Portfolio : ప్రతిష్ఠాత్మకమైన బైక్ రేసుల్లో ఒకటైన మోటోజీపీ (MotoGP) ఫస్ట్ టైం భారత్‌లో గ్రాండ్ రేసింగ్ ఈవెంట్ నిర్వహించనుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 24 వరకు మొత్తం 3 రోజులు మోటోజీపీ భారత్ (MotoGP Bharat) ఈవెంట్ జరుగనుంది.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(Buddh International Circuit)లో ఈ రేసు గ్రాండ్‌గా జరగబోతోంది. మోటోజీపీ హిస్టరీలో బైక్ రేస్ జరగడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. (MotoGP Bharat Grand Prix) ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ పోటీలో ప్రముఖ బైక్ రేసర్లు పాల్గొననున్నారు.
అయితే, MotoGP భారత్ ప్రారంభ ఎడిషన్ సందర్భంగా భారత అతిపెద్ద (EV) కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Eletric) కూడా తమ ఫ్యూచర్ మోటార్ సైకిల్ పోర్ట్ ఫోలియోను ప్రదర్శించనుంది. ఈ మోటార్‌సైకిళ్ల ఫ్యాన్‌జోన్‌లోని ఓలా బూత్‌లో ప్రదర్శించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులకు బైక్‌లను అన్వేషించడానికి, మోటార్‌సైక్లింగ్ భవిష్యత్తుపై ఓలా అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో ఓలా డైమండ్‌హెడ్, అడ్వెంచర్ , క్రూయిజర్, రోడ్‌స్టర్‌లు ఫ్యాన్‌జోన్‌లోని కంపెనీ స్టాల్‌లో ప్రదర్శించనుంది. ఓలా అన్ని ఆన్-గ్రౌండ్ సపోర్టు కోసం S1 స్కూటర్‌లను నడిపేందుకు BICతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌తో ఓలా భాగస్వామ్యం :
బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) వ్యూహాత్మక భాగస్వామ్యంతో MotoGP సమయంలో ఉపయోగించడానికి ఓలా విప్లవాత్మక S1 స్కూటర్లను నిర్వాహకులకు అందజేస్తోంది. ఈ ఓలా S1 స్కూటర్లు మార్షల్ సపోర్ట్‌తో సహా ఆన్-గ్రౌండ్ సపోర్ట్ యాక్టివిటీలకు ICE టూ-వీలర్‌లను అందించనుంది. ఓలా, బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ మధ్య ఈ భాగస్వామ్యంతో 2024లో (MotoE) వరల్డ్ ఛాంపియన్‌షిప్ రెండో సీజన్‌కు రెడీ అవుతున్న మోటోజీపీ కార్యకలాపాలకు మరింత చేయూతనివ్వనుంది.
Ola to Showcase its Electric Motorcycle Portfolio at MotoGP Bharat
ఓలా ఎలక్ట్రిక్ సీఎంఈ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. భారత్‌లో మోటార్‌స్పోర్ట్‌లకు అద్భుతమైన సమయం. హై క్లాస్ మోటార్‌సైకిల్ రేసింగ్ భారత్‌కు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. మోటోజీపీ టూ-వీలర్ రేసింగ్ సమయంలో ఓలా ఈవీ టూ వీలర్ వాహనాలను సూచిస్తుంది. మోటార్‌సైకిళ్ల గ్లోబల్ మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఓలా మోటార్‌సైక్లింగ్ భవిష్యత్తును ప్రదర్శించాలని భావిస్తున్నాం. ఓలా విజన్, ఇంజనీరింగ్, టెక్నాలజీని ప్రపంచ స్థాయిలో అందించవచ్చు. భారత్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల భవిష్యత్తు గురించి వినియోగదారులను మరింత ఉత్తేజపరుస్తుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
టూ వీలర్ మార్కెట్లో ఓలా ముందంజ :
గత 2 ఏళ్లుగా 2W సెగ్మెంట్‌లో భారత్ ఈవీలను అందించడంలో ఓలా ముందు వరుసలో నిలిచింది. కొత్త మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియో 4 బెస్ట్-ఇన్-క్లాస్ మోడల్‌లలో విస్తరించి ఉంది. అందులో, డైమండ్‌హెడ్, అడ్వెంచర్, క్రూయిజర్ రోస్టర్, కంపెనీ మోటార్‌సైకిళ్లను రీమాజిన్ చేస్తోంది.
అన్ని ప్రముఖ కేటగిరీలలో బైక్‌లను అందించడంతో ఓలా అన్ని ఫారమ్ ధరల పాయింట్‌లలో యూజర్ల డిమాండ్‌లను తీర్చనుంది. ప్రతి కేటగిరీ కింద పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. R&D సెల్ తయారీలో ఓలా పెట్టుబడి సంస్థ భవిష్యత్తు ఉత్పత్తుల విజయానికి ఆధారం అవుతుంది. బైక్‌ల కోసం ప్రీ-రిజర్వ్ ఓపెన్ చేయగా, 2024 చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.