OnePlus 11R Launch : వన్‌ప్లస్ సరికొత్త 11ఆర్ సోలార్ రెడ్ ఎడిషన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus 11R Solar Red Edition : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ 11ఆర్ సోలార్ రెడ్ ఎడిషన్ వస్తోంది. ఏప్రిల్ 18న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 11R Solar Red Edition : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త వన్‌ప్లస్ 11ఆర్ సోలార్ రెడ్ ఎడిషన్‌లో మరో వేరియంట్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా ఏప్రిల్ 18న లాంచ్‌ తేదీని ధృవీకరించింది. ఈ కొత్త వేరియంట్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ధర వివరాలు ప్రస్తుతానికి తెలియవు. అయితే, ఇటీవల లాంచ్ చేసిన వన్‌ప్లస్ 12ఆర్ కన్నా ధర చాలా తక్కువగా ఉండవచ్చు.

Read Also : Vivo T3x 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌కు వివో T3x 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. కేవలం ధర రూ 12,499 మాత్రమే..!

రూ.999కే ప్రీ-బుకింగ్ :
ప్రస్తుతం భారత మార్కెట్లో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ రూ. 39,999కి విక్రయిస్తోంది. ఒరిజినల్ వన్‌ప్లస్ 11ఆర్ వెర్షన్ ప్రస్తుతం రూ. 32,999కి విక్రయిస్తోంది. సోలార్ రెడ్ మోడల్ ధర సాధారణ 11ఆర్ మోడల్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. సోలార్ ఫోన్ లాంచ్ రోజున దీనిపై క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం, ఆసక్తిగల కొనుగోలుదారులు అమెజాన్ ద్వారా రెడ్ ఎడిషన్‌ను రూ. 999కి ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే ఇ-కామర్స్ సైట్‌లో రిడెంప్షన్‌కు ముందు ప్రీ-బుకింగ్ మొత్తం అమెజాన్ పే బ్యాలెన్స్‌గా చెల్లించవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, వన్‌కార్డ్‌లపై కంపెనీ రూ. 1,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. కొంత మొత్తంలో ధర తగ్గింపు ఉంటుందని అమెజాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు.. కస్టమర్‌లు 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ క్లెయిమ్ అవకాశం కూడా ఉంటుంది. ఈ డివైజ్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న యూజర్లు స్పెషిఫికేషన్లు చూడవచ్చు. వన్‌ప్లస్ 11ఆర్ సోలార్ రెడ్ వెర్షన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ 1 ఎస్ఓసీ నుంచి పవర్ పొందుతుంది.

ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ డివైజ్ పంచ్-హోల్ డిజైన్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీ మాదిరిగానే కర్వడ్ ఎడ్జ్ కలిగి ఉంది. స్క్రీన్ 1450నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1440హెచ్‌జెడ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్‌కు సపోర్టును అందిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. :
బ్యాక్ సైడ్ సిస్టమ్‌లో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 16ఎంపీ కెమెరా కూడా కలిగి ఉంది. మిడ్-రేంజ్ ప్రీమియం 5జీ ఫోన్ వన్‌ప్లస్ ఫోన్ పెద్ద 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 100డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జర్‌తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 25 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. వన్‌ప్లస్ ఇప్పటికీ రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తుంది.

Read Also : Mahindra Bolero Neo Plus : 9-సీటర్ కెపాసిటీతో కొత్త మహీంద్రా బొలెరో నియో ప్లస్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు