OnePlus 12 Camera event on November 9
OnePlus 12 Camera Event : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) ఇటీవలే రాబోయే (OnePlus 12) స్మార్ట్‌ఫోన్ కొన్ని కీలక స్పెక్స్‌లను ధృవీకరించింది. కంపెనీ ఇప్పుడు నవంబర్ 9న కెమెరా పర్ఫార్మెన్స్ గురించి వివరాలను వెల్లడించనుంది. చిప్‌సెట్ నేమ్, డిస్‌ప్లే వివరాలు ఇప్పటికే రివీల్ చేసింది.
వాస్తవానికి, వన్‌ప్లస్ అన్నింటినీ బహిర్గతం చేయదు. ఎందుకంటే ఇది కేవలం కొత్త 5G ఫోన్ కెమెరా ఈవెంట్ మొత్తం లాంచ్ ఈవెంట్ త్వరలో జరుగుతుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 12 లాంచ్ మొదట చైనాలో జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కంపెనీ దానిని ఆవిష్కరించాలని యోచిస్తోంది. భారత్ వంటి ప్రపంచ మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వనంది.
Read Also : Update Aadhaar Card : ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్ ఫొటోను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!
వన్‌ప్లస్ 12 మెరుగైన జూమ్ సామర్థ్యాలతో రావచ్చు. లీక్‌లను విశ్వసిస్తే.. వన్‌ప్లస్ 12 ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రాథమిక సెన్సార్ OIS సపోర్టు, f/1.7 ఎపర్చర్‌తో 50ఎంపీ సోనీ IMX966 కెమెరా కావచ్చు. 48ఎంపీ సోనీ IMX581 అల్ట్రావైడ్ కెమెరా, 64ఎంపీ 3x పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో కలిసి ఉంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరాను చూడవచ్చు.
OnePlus 12 Camera event on November 9
ఈ టీజర్‌లను చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో 91మొబైల్స్ గుర్తించాయి. టీజర్‌లు ఫ్లాగ్‌షిప్ డివైజ్ బ్యాక్ కెమెరా డిజైన్‌ను వెల్లడించలేదు. అయితే, వన్‌ప్లస్ షేర్ చేసిన అధికారిక మోడల్ హ్యాండ్‌సెట్ ముందు నుంచి వన్‌ప్లస్ 11 మాదిరిగానే కనిపిస్తుందని వెల్లడించింది. డిస్‌ప్లే చుట్టూ సన్నని బెజెల్‌లను కలిగి ఉంది. ఈ డివైజ్ కుడి వైపున ఉంచిన వాల్యూమ్, పవర్ బటన్‌లు. ముందు భాగంలో మునుపటి మోడల్‌ల మాదిరిగానే పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్ ఉంది.
కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. ఫ్లాగ్‌షిప్ ఫోన్ DisplayMate A+ సర్టిఫికేషన్‌ను పొందింది. స్క్రీన్ 2K రిజల్యూషన్‌కు సపోర్టు అందిస్తుంది. డిస్‌ప్లే సైజు ఇంకా తెలియనప్పటికీ, హ్యాండ్‌సెట్ వన్‌ప్లస్ 11 6.7-అంగుళాల LTPO స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చని ఫొటోలు సూచించాయి. ఓరియంటల్ స్క్రీన్ కలిగి ఉంటుంది.
ఈ డివైజ్‌లో ఒప్పో ఫస్ట్ జనరేషన్ డిస్‌ప్లే చిప్ డిస్‌ప్లే P1, మెరుగైన ఇమేజ్ క్వాలిటీ, హై బ్రైటనెస్, తక్కువ పవర్ వినియోగంతో హై-ప్రెసిషన్ పిక్సెల్-లెవల్ కాలిబ్రేషన్ అల్గారిథమ్ ఉంటుంది. వన్‌ప్లస్ 12 క్వాల్‌కామ్న్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఇటీవలి BOE కాన్ఫరెన్స్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ ఇప్పటికే ధృవీకరించింది.