OnePlus 12 Launch : బిగ్ బ్యాటరీ, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వన్‌ప్లస్ 12 ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే?

OnePlus 12 Launch : నెలల తరబడి పుకార్లు, లీక్‌ల తర్వాత ఎట్టకేలకు కొత్త ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ చిప్‌సెట్, వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ మాదిరిగానే అప్‌గ్రేడ్ ఫీచర్లతో వచ్చింది. ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus 12 launched with better display, bigger battery

OnePlus 12 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త వన్‌ప్లస్ 12 ఫోన్‌ వచ్చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు సంబంధించి నెలల తరబడి పుకార్లు, లీక్‌ల తర్వాత ఎట్టకేలకు చైనాలో లాంచ్ అయింది. వన్‌ప్లస్ 11 సక్సెసర్ 2024లో భారత్ వంటి గ్లోబల్ మార్కెట్‌లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. కొత్త వెర్షన్ పెద్ద అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. వన్‌ప్లస్ 12లో కొత్త ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్, వన్‌ప్లస్ ఓపెన్ మాదిరిగానే అప్‌గ్రేడ్ చేసిన కెమెరా సిస్టమ్, పెద్ద బ్యాటరీ, టాప్-నాచ్ క్వాలిటీ డిస్‌ప్లే వంటి మరిన్ని ఫీచరర్లు ఉన్నాయి. కొత్త వన్‌ప్లస్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను ఓసారి లుక్కేయండి.

వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 12 ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల క్యూహెచ్‌డీ+ 2కె ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎల్‌టీపీఓ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 1హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఉంది. స్క్రీన్‌పై ఉన్న కంటెంట్ ఆధారంగా ఆటోమాటిక్‌గా అడ్జెస్ట్ అవుతుంది. ఈ స్క్రీన్ 4,500నిట్‌ల గరిష్ట ప్రకాశంతో సపోర్టును కలిగి ఉంది. అదనంగా, ప్యానెల్ డాల్బీ విజన్, 10బిట్ కలర్ డెప్త్, ప్రోఎక్స్‌డిఆర్, 2160హెర్ట్జ్ పిడబ్ల్యుఎమ్ డిమ్మింగ్‌కు సపోర్టు అందిస్తుంది. కంపెనీ, వన్‌ప్లస్ 11 డిజైన్‌ను అలాగే ఉంచింది. కొత్త ఫోన్‌ను వివిధ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : OnePlus Watch 2 Launch : కొత్త వన్‌ప్లస్ వాచ్ 2 వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో 14 రోజుల బ్యాటరీ లైఫ్..!

వన్‌ప్లస్ 12 ఫోన్ క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. మెరుగైన స్పీడ్ కోసం లేటెస్ట్ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ సొల్యూషన్‌ల ద్వారా సపోర్టు అందిస్తుంది. కంపెనీ కొత్త వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ క్రయో-స్పీడ్ కూలింగ్ సిస్టమ్ ఉందని, మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం కూలింగ్ మెటీరియల్, స్ట్రక్చర్ డిజైన్‌లో మెరుగుపరుస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50ఎంపీ ఎల్‌వైటీ808 సోనీ సెన్సార్, 3ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో 64ఎంపీ ఓవీ64బీ సెన్సార్ ఉన్నాయి. దీనికి అదనంగా, మూడవ కెమెరా కూడా ఉంది. 48ఎంపీ ఐఎమ్ఎక్స్581 అల్ట్రా-వైడ్ కెమెరా, కెమెరా సెటప్ వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్‌ మాదిరిగానే ఉంటుంది.

100డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,400ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. వన్‌ప్లస్ 12 స్ప్లాష్ నిరోధకతకు ఐపీ65 రేటింగ్‌ను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. 164.3×75.8×9.15ఎమ్ఎమ్ కొలతలు, 220గ్రాముల బరువు ఉంటుంది.

OnePlus 12 launched bigger battery

వన్‌ప్లస్ 12 ధర ఎంతంటే? :
కొత్తగా లాంచ్ అయిన వన్‌ప్లస్ 12 చైనాలో సీఎన్‌వై 4,299 (సుమారు రూ. 50,700) ప్రారంభ ధరతో ప్రకటించింది. అయితే, భారతీయ మార్కెట్‌లో ఇదే ధర ఉండదు. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 11 రూ. 60వేల కన్నా ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎందుకంటే.. వన్‌ప్లస్ 11 ధర రూ. 56,999కి అందుబాటులోకి వచ్చింది. వన్‌ప్లస్ 12 అందించే టాప్-లైన్ ఫీచర్ల కారణంగా కంపెనీ కొత్త మోడల్ ధరను పెంచే అవకాశం ఉంది. డిసెంబర్ 11, 2023న చైనాలో వన్‌ప్లస్ 12 ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో వన్‌ప్లస్ 12 లాంచ్? :
కొత్త వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గ్లోబల్ లభ్యతను కంపెనీ ధృవీకరించింది. కంపెనీ అందించిన అధికారిక వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ 12 2024 ప్రారంభంలో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అవుతుంది. కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, జనవరి 23న వన్‌ప్లస్ 12 ఇండియా ఈవెంట్ జరుగుతుందని లీక్‌లు సూచిస్తున్నాయి.

Read Also : MG Motor Car Price Hike : మారుతి, టాటా బాటలో ఎంజీ మోటార్.. 2024 జనవరిలో పెరగనున్న కార్ల ధరలు..!

ట్రెండింగ్ వార్తలు