OnePlus 12 With Snapdragon 8 Gen 3 SoC to Launch
OnePlus 12 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ నుంచి సరికొత్త మోడల్ వచ్చేస్తోంది. వచ్చే డిసెంబర్ మొదటివారంలో వన్‌ప్లస్ 12 చైనాలో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. చైనీస్ తయారీదారు వెయిబో ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. వన్‌ప్లస్ 12 ఫోన్ అనేది వన్‌ప్లస్ 11 మోడల్‌కు సక్సెసర్‌గా స్వదేశానికి రానుందని కంపెనీ వెల్లడించింది.
రాబోయే ఈ ఫోన్ క్వాల్‌కామ్న్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 3 ఎస్ఓసీలో రన్ అవుతుంది. 2కె రిజల్యూషన్‌తో బీఓఈ ఎక్స్1 ఓల్ఈడీ ఎల్టీపీఓ డిస్‌ప్లేతో రానుందని ఇప్పటికే రివీల్ చేసింది. వన్‌ప్లస్ 12 మోడల్ కలర్ఓఎస్ 14తో రానుంది. 64ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ కంపెనీ 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా డిసెంబర్ 4న చైనాలో వన్‌ప్లస్ 12 లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈవెంట్ స్థానిక కాలమానం ప్రకారం.. రాత్రి 7:00 గంటలకు జరుగనుంది. వన్‌ప్లస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా వన్‌ప్లస్ 12 డిజైన్, స్పెసిఫికేషన్‌ల గురించి మరిన్ని వివరాలను వెల్లడించింది.
Read Also : OnePlus Watch 2 Launch : కొత్త వన్‌ప్లస్ వాచ్ 2 వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 14 రోజుల బ్యాటరీ లైఫ్..!
ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్‌ప్లస్ ఫోన్ కలర్ఓఎస్ 14లో రన్ అవుతుందని కంపెనీ తెలిపింది. డిస్‌ప్లే మేట్ ఎ ప్లస్ సర్టిఫికేషన్, 2కె రిజల్యూషన్ డిస్‌ప్లేతో రానున్న చైనాలో మొదటి హ్యాండ్‌సెట్‌గా పేర్కొంది. ప్రోఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే 2,600 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందించనుంది.
OnePlus 12
కెమెరా ఫీచర్లు (అంచనా) :
వన్‌ప్లస్ 12 కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 3 ఎస్ఓసీతో రానుంది. సోనీ ఎల్‌వైటీఐఏ ఎల్‌వైటీ808 ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండనుంది. 64ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. గత లీక్‌ల ప్రకారం.. వన్‌ప్లస్ 12 ఫోన్ 6.82-అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ (1,440 x 3,168 పిక్సెల్‌లు) కర్వడ్ లో-టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్ (LTPO) డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ని పొందవచ్చు.
OnePlus 12 Launch
గ్లోబల్ లాంచ్ ఎప్పుడంటే? :
ఈ హ్యాండ్‌సెట్ 32ఎంపీ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. 100డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400ఎంఎహెచ్ బ్యాటరీతో రానుంది. వన్‌ప్లస్ 12 గ్లోబల్ లాంచ్ వచ్చే ఏడాది జనవరిలో ఉండవచ్చు. వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ ఈ ఏడాది జనవరిలో చైనాలో సీఎన్‌వై 3,999 (దాదాపు రూ. 48వేలు) బేస్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది. గత ఫిబ్రవరి 7న జరిగిన వన్‌ప్లస్ క్లౌడ్ 11 ఈవెంట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 56,999కు అందుబాటులోకి వచ్చింది.
Read Also : OnePlus 12 Camera Event : ఈ నెల 9నే వన్‌ప్లస్ 12 కెమెరా ఈవెంట్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..