OnePlus 13s Price
OnePlus 13s : వన్‌ప్లస్ యూజర్ల కోసం కొత్త ఫోన్ వచ్చేస్తోంది. వన్‌ప్లస్ 13s లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, వివరాలు రివీల్ అయ్యాయి. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ నుంచి కొత్త డిజైన్ మార్పుల వరకు ఈ ఫోన్ ఇప్పటికే హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
వన్‌ప్లస్ అధికారికంగా లాంచ్ తేదీని ధృవీకరించనప్పటికీ, వన్‌ప్లస్ 13s ఈ నెలాఖరు నాటికి భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
వన్‌ప్లస్13s డిజైన్ :
వన్‌ప్లస్13s కాంపాక్ట్, ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫోన్ వర్టికల్ డ్యూయల్-కెమెరా సెటప్‌తో పాటు LED ఫ్లాష్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్ కటౌట్‌లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్లిమ్ బెజెల్స్‌తో ఫోన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
వన్‌ప్లస్13s స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్13s ఫోన్ 6.32-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. పదునైన 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. హుడ్ కింద క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
వన్‌ప్లస్ ఫోన్ 12GB వరకు ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజీని అందించవచ్చు. వన్‌ప్లస్13s భారీ 6,260mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 13s కెమెరాలు :
ఈ కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.
వన్‌ప్లస్ 13s ఫీచర్లు :
వన్‌ప్లస్ ఐకానిక్ అలర్ట్ స్లైడర్‌ను కొత్త “ప్లస్ కీ”తో రిప్లేస్ చేస్తోంది. యూజర్ ప్రాధాన్యతల ఆధారంగా షార్ట్‌కట్స్ లేదా అదనపు కంట్రోలింగ్ కోసం కస్టమైజడ్ బటన్ కలిగి ఉంది.
వన్‌ప్లస్13s కలర్ ఆప్షన్లు :
కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. కొనుగోలుదారులు బ్లాక్, గ్రే, పింక్ వేరియంట్‌ల నుంచి ఎంచుకోవచ్చు.
భారత్‌లో వన్‌ప్లస్13s ధర (అంచనా) :
భారత మార్కెట్లో వన్‌ప్లస్13s ధర దాదాపు రూ. 50వేలు ఉండే అవకాశం ఉంది.
Read Also : Vivo V27 Pro : వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. వివో V27 ప్రో ఎందుకు కొనాలంటే? యువత మెచ్చిన ఫోన్..!
వన్‌ప్లస్ 13s లాంచ్ టైమ్‌లైన్, లభ్యత :
ఈ నెలాఖరు నాటికి భారత మార్కెట్లోకి వన్‌ప్లస్13s లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బ్రాండ్ లైనప్‌లో వన్‌ప్లస్13R, ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్13 మధ్య ఉండే అవకాశం ఉంది.