OnePlus 13S
OnePlus 13S : కొత్త వన్‌ప్లస్ కొనుగోలుదారులకు అదిరిపోయే డిస్కౌంట్.. భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ వినియోగదారులను భారీగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ వన్‌ప్లస్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. రూ. 54,999 ధరతో లాంచ్ కాగా ప్రస్తుతం రూ. 5వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభ్యమవుతోంది.
బ్యాంక్, ఇతర కార్డు ఆఫర్లతో కలిపి ధర ఇంకా తగ్గించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ 6.32-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. వన్‌ప్లస్ 13s డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 13s ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13s ప్రారంభ ధర రూ. 54,999తో ప్రారంభమైంది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5,549 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది, ప్రస్తుత ధర రూ. 49,450కు తగ్గింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలుదారులు అదనంగా రూ. 2,472 డిస్కౌంట్ పొందవచ్చు.
నెలకు కేవలం రూ. 1,738 నుంచి ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అప్‌గ్రేడ్ కోసం ఫ్లిప్‌కార్ట్ మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 39,850 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే కచ్చితమైన రీసేల్ వాల్యూ మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13s ఫోన్ 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే 460ppi పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+, అలాగే HDR వివిడ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే 1,600 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB LPDDR5X ర్యామ్, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చిన్న సైజు అయినా భారీ 5,850mAh బ్యాటరీతో వస్తుంది. 80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. OISతో 50ఎంపీ సోనీ LYT-700 ప్రైమరీ సెన్సార్ అందిస్తుంది. 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌తో కూడా వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32MP ఫ్రంట్-ఫేసింగ్ సెన్సార్ ఉంటుంది. Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్, USB టైప్-C, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, గైరోస్కోప్, ఇ-కంపాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.