OnePlus 15: వన్‌ప్లస్ 15కు సంబంధించి కొత్తగా మరిన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. లీక్ అయిన పిక్‌ను విశ్లేషించి “మింట్” పలు వివరాలు తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. కొత్త మోడల్‌లో కీలకమైన డిజైన్ మార్పులు, కాన్ఫిగరేషన్ వివరాలు బయటపడ్డాయి.
రిపోర్ట్ ప్రకారం.. వన్‌ప్లస్ 13 సహా గత మోడళ్లలో ఉన్న వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను వన్‌ప్లస్ 15లో ఉండదు. వన్‌ప్లస్ 15లో గుండ్రని అంచులతో చతురస్రాకార కెమెరా ఐలాండ్ వచ్చే అవకాశం ఉంది. ఆ మాడ్యూల్‌లో 3 సెన్సార్లు ఉండనున్నట్లు సమాచారం.
వన్‌ప్లస్ 15 బ్లాక్, పర్పుల్, టైటానియం రంగుల్లో రావచ్చని ప్రచారం జరుగుతోంది. పనితీరులో 12జీబీ ర్యామ్ + 256జీబీ లేదా 512జీబీ స్టోరేజ్, 16జీబీ ర్యామ్ + 256జీబీ లేదా 512జీబీ స్టోరేజ్ వెర్షన్లు ఉండే అవకాశం ఉంది. 16జీబీ ర్యామ్ + 1టీబీ స్టోరేజ్‌తో టాప్ వెర్షన్ కూడా రావొచ్చు.
ఈ డివైస్‌లో 6.78 అంగుళాల ఫ్లాట్ ఎల్‌టీపీవో డిస్‌ప్లే, 1.5కే రిజల్యూషన్, గరిష్ఠంగా 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుందని చెబుతున్నారు. 7,000ఎంఏహెచ్ కంటే ఎక్కువ సామర్థ్యంతో బ్యాటరీ, 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కూడా ఉండవచ్చని సమాచారం.
ఎల్‌టీపీవో డిస్‌ప్లే అంటే తక్కువ శక్తి వినియోగంతో అధిక రిఫ్రెష్ రేట్ అందించే స్క్రీన్ టెక్నాలజీ. రిఫ్రెష్ రేట్ అంటే స్క్రీన్ ప్రతి సెకనుకు ఎన్ని సార్లు రీఫ్రెష్ అవుతుందో చూపించే కొలమానం. (OnePlus 15)
వన్‌ప్లస్ 14 రాదా?
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ 13 తర్వాత నేరుగా వన్‌ప్లస్ 15 రావచ్చు. వన్‌ప్లస్ 13 2024లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ , 24జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్డ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌తో విడుదలైంది. అయితే వన్‌ప్లస్ 14 వస్తుందా, లేదా? అన్న దానిపై స్పష్టత లేదు.