OnePlus 15T : 7500mAh బ్యాటరీ, డ్యూయల్ 50MP కెమెరాతో కొత్త వన్‌ప్లస్ 15T అదుర్స్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతంటే?
OnePlus 15T : కొత్త వన్‌ప్లస్ ఫోన్ వచ్చేసింది. వన్‌ప్లస్ 15T ధర, డిజైన్, అన్ని స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Sreehari A
- Published On : March 24, 2026 / 08:10 PM IST
OnePlus 15T
- 7500mAh బ్యాటరీతో డ్యూయల్ 50MP కెమెరా, వన్‌ప్లస్ 15T
- 6.32-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా
- సింగిల్ ఛార్జ్‌పై 22.8 గంటల ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్
OnePlus 15T : కొత్త వన్‌ప్లస్ కోసం చూస్తున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో మరో కొత్త వన్‌ప్లస్ 15T ఫోన్ వచ్చేసింది. మార్చి 24న చైనాలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 3 కలర్ ఆప్షన్లు, 5 స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. వన్‌ప్లస్ 15Tలో 7500mAh బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 22.8 గంటల ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్‌ను కూడా అందిస్తుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఈ ఫోన్‌లో 165Hz, 180Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. వన్‌ప్లస్ 15Tలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది.
వన్‌ప్లస్ 15T స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 15T 1800 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ 6.32-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ TUV రైన్‌ల్యాండ్ స్మార్ట్ ఐ ప్రొటెక్షన్ 5.0, లో బ్లూ లైట్ ద్వారా వెరిఫై అయిందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఈ ఫోన్ IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుందని వన్‌ప్లస్ పేర్కొంది.
ప్రాసెసర్ :
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8-సిరీస్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ అద్భుతమైన గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. AnTuTu బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై 44,50,000 పాయింట్లను సాధించిందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో 16GB LPDDR5x అల్ట్రా ప్రో ర్యామ్, 1TB వరకు UFS 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కూడా ఉన్నాయి.
కెమెరా :
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 15Tలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఒప్పో LUMO ఇమేజింగ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇందులో ప్రైమరీ షూటర్ సోనీ అల్ట్రా విజన్ సెన్సార్‌తో 50MP కెమెరా ఉంది. 3.5x వరకు ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో రియర్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌కు సరిపోతుంది.
బ్యాటరీ :
వన్‌ప్లస్ 15టీలో 7,500mAh బ్యాటరీ ఉంది. 100W సూపర్‌వూక్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్‌లలో 5G, 4G LTE, NFC, Wi-Fi 7, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్, GPS, GLONASS, BeiDou, Galileo, QZSS ఉన్నాయి.
భద్రతా ఫీచర్లు :
సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ప్రాక్సిమిటీ సెన్సార్, ఓరియంటేషన్ సెన్సార్, లైట్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, ఆల్టిట్యూడ్ సెన్సార్, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అనేక ఆన్‌బోర్డ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 194 గ్రాములు ఉంటుంది.
చైనాలో వన్‌ప్లస్ 15T ధర ఎంత?
- 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్: CNY 4,299 (భారత కరెన్సీలో సుమారు రూ. 58,000)
- 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్: CNY 4,899 (భారత కరెన్సీలో సుమారు రూ. 67,000)
- 16GB ర్యామ్ + 256GB స్టోరేజ్: CNY 4,599 (భారత కరెన్సీలో సుమారు రూ. 63,000)
- 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్: CNY 5199 (భారత కరెన్సీలో సుమారు రూ. 71,000)
- 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్: CNY 5699 (భారత కరెన్సీలో సుమారు రూ. 78,000)
