OnePlus Nord 3 India price leaked ahead of June launch, here are the details
OnePlus Nord 3 Price in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త ఫోన్ రాబోతోంది. జూన్ 2023లో భారత మార్కెట్లో (OnePlus Nord 3 5G) ఫోన్ లాంచ్ కానుంది. ఈ కొత్త ఫోన్ లాంచ్‌పై కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ (Yogesh Brar) రాబోయే వన్‌ప్లస్ ఫోన్ ధరను లీక్ చేశారు. ఈ వన్‌ప్లస్ Nord 3 స్పెసిఫికేషన్‌లను కూడా రివీల్ చేశారు. అవేంటో ఓసారి చూద్దాం..
వన్‌ప్లస్ Nord 3 ధర లీక్ :
రాబోయే వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ భారత మార్కెట్లో రూ. 30వేలు లేదా రూ. 32వేలుగా ఉంటుందని నివేదిక పేర్కొంది. వన్‌ప్లస్ రూ. 30వేల మార్కును మించదని అంచనా వేయలేదు. ఎందుకంటే.. కంపెనీ తన వన్‌ప్లస్ Nord సిరీస్ కోసం ధరను రిజర్వ్ చేసింది. ఒరిజినల్ వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్‌లు చాలా వరకు రూ. 30వేల లోపు ఉన్నాయి.
Read Also : OnePlus Nord 3 : రూ.30వేల లోపు ధరలో వన్‌ప్లస్ నార్డ్ 3 వచ్చేస్తోంది.. ఈ 5G ఫోన్ లాంచ్ ఎప్పుడంటే?
హై బడ్జెట్‌లో ఎక్కువ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇష్టపడే యూజర్ల కోసం కంపెనీ ఇప్పటికే రూ. 30వేల కన్నా ఎక్కువ ధర కలిగిన ఫోన్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా, iQOO Neo 7, Poco F5 5G వంటి పోటీదారులతో భారత మార్కెట్లో ఇదే ధర పరిధిలో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త వన్‌ప్లస్ మిడ్-రేంజ్ ఫోన్ ఇతర పోటీదారుల కన్నా ఎక్కువ ధరకు అందుబాటులోకి రానుంది.
OnePlus Nord 3 India price leaked ahead of June launch, here are the details
వన్‌ప్లస్ Nord 3 స్పెసిఫికేషన్‌లు లీక్ :
వన్‌ప్లస్ నోర్డ్ 3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను కూడా లీక్ చేసింది. ఈ 5G ఫోన్ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది. 6.74 అంగుళాల సైజులో AMOLED డిస్‌ప్లేతో రావొచ్చు. ఎందుకంటే.. ఎల్లప్పుడూ ఒరిజినల్ Nord సిరీస్ ఫోన్‌లలోనే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది. హుడ్ కింద, MediaTek డైమెన్సిటీ 9000 SoC ఉండవచ్చు. ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ చిప్‌సెట్.. కంపెనీ OnePlus ప్యాడ్‌కు కూడా పవర్ అందిస్తుంది. వన్‌ప్లస్ Nord 3 అదే చిప్‌ని అందించనుంది. ఈ బ్రాండ్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు.
బ్యాక్ సైడ్ 50-MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించనుంది. 8-MP సెన్సార్, 2-MP కెమెరాతో రానుంది. ఫ్రంట్ సైడ్ 5G ఫోన్ 16-MP కెమెరాను కలిగి ఉంటుంది. కంపెనీ సిగ్నేచర్ అలర్ట్ స్లైడర్ ఫీచర్‌ను అందించనుంది. ఇప్పుడు ఎంపిక చేసిన OnePlus ఫోన్‌లలో మాత్రమే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 14OS ఇంకా రిలీజ్ కాలేదు. వన్‌ప్లస్ నోర్డ్ 3 ఆండ్రాయిడ్ 13OSతో రానుంది. OnePlus హుడ్ కింద సాధారణ 5,000mAh బ్యాటరీని అందించనుంది. కంపెనీ ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను కూడా అందించనుంది. వన్‌ప్లస్ Nord 3 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ సపోర్టుతో రానుంది.
Read Also : Whatsapp Block Accounts : ఆ అకౌంట్లను వెంటనే బ్యాన్ చేయాలి.. వాట్సాప్‌కు కేంద్రం ఆదేశాలు..