OnePlus Nord 5 : వన్‌ప్లస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఈ నెల 8నే వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లపై భారీ అంచనాలివే..!

OnePlus Nord 5 : కొత్త వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 8న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. స్పెషిఫికేషన్లు, ధర పూర్తి వివరాలివే

OnePlus Nord 5

OnePlus Nord 5 : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వన్‌ప్లస్ నెక్స్ట్ జనరేషన్ నార్డ్ సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ లైనప్‌లో (OnePlus Nord 5) రెండు ఫోన్‌లు ఉంటాయని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. అందులో వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 ఫోన్లు ఉన్నాయి.

బేస్ మోడల్ నార్డ్ 5 డిజైన్, పర్ఫార్మెన్స్, కెమెరా, డిస్‌ప్లే సహా అనేక అప్‌గ్రేడ్‌లను అందుకోనుంది. ఈ వన్‌ప్లస్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్, 144hz డిస్‌ప్లే, 50MP కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఇతర వివరాలు రివీల్ చేయకపోయినా వన్‌ప్లస్ నార్డ్ 5 భారత్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ భారత్ లాంచ్ డేట్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ నార్డ్ CE 5 జూలై 8న మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం) లాంచ్ అవుతాయి. ఈ సందర్భంగా కంపెనీ వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా ప్రవేశపెట్టనుంది. వన్‌ప్లస్ అభిమానులు సోషల్ మీడియాలో రియల్ టైమ్ అప్‌డేట్స్, యూట్యూబ్‌లో లాంచ్ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE 5 సహా అన్ని అమెజాన్, వన్‌ప్లస్, వన్‌ప్లస్ e-స్టోర్ వంటి ఎంపిక చేసిన రిటైల్ ఛానల్ పార్టనర్ల వద్ద అందుబాటులో ఉంటాయి.

Read Also : OnePlus 13 Price : ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ 5 ధర (అంచనా) :
వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ ధర రూ.30వేల నుంచి రూ.35వేల మధ్య ఉండవచ్చని అంచనా. నివేదికల ప్రకారం.. బేస్ వేరియంట్ ధర రూ.29,999 ఉండవచ్చు. అధికారిక ధర ఇంకా రివీల్ చేయలేదు. లాంచ్ తర్వాత ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభం కావచ్చు. వన్‌ప్లస్ నార్డ్ CE 5 ప్రారంభ ధర దాదాపు రూ.25వేల మధ్య ఉండవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ 5 స్పెసిఫికేషన్లు (అంచనా) :
నివేదికలు నిజమైతే.. వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో రావచ్చు. ఈ వన్‌ప్లస్ ఫోన్ 12GB LPDDR5x ర్యామ్, 512GB వరకు UFS 3.1 స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3ని కలిగి ఉంటుంది.

ఈ వన్‌ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 6,800mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. కెమెరా విషయానికొస్తే.. ఈ వన్‌ప్లస్ ఫోన్ 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండొచ్చు.