OnePlus Nord 6 : వన్‌ప్లస్ నార్డ్ 6 భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు!
OnePlus Nord 6 : వన్‌ప్లస్ నార్డ్ 6 భారీగా తగ్గిందోచ్.. అమెజాన్ సేల్ సందర్భంగా అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- October 8, 2026 / 05:35 PM IST
OnePlus Nord 6
- ఈ-కామర్స్ కంపెనీ ఫోన్‌పై 15శాతం డైరెక్ట్ డిస్కౌంట్
- వన్‌ప్లస్ ఫోన్‌పై రూ. 42,500 తగ్గింపు ధరకు పొందొచ్చు
- ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్ అందిస్తుంది
OnePlus Nord 6 : వన్‌ప్లస్ ఫోన్ ఆఫర్ అదుర్స్.. వన్‌ప్లస్ నార్డ్ 6 ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌పై 15శాతం తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందొచ్చు.
ఫోన్ విషయానికి వస్తే.. అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో భారీ 9000mAh బ్యాటరీ ఉంది. ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 6పై అందుబాటులో బెస్ట్ డీల్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వన్‌ప్లస్ నార్డ్ 6 అమెజాన్ సేల్ ఆఫర్ :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ నార్డ్ 6 భారీ తగ్గింపుతో కొనేసుకోవచ్చు. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ ధరల మధ్య ఈ ఫోన్ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ సంస్థ ఈ ఫోన్‌పై ఫ్లాట్ 15శాతం డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ధర రూ .44,999కు తగ్గుతుంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులు, ఈఎంఐలపై రూ. 2,500కు పైగా ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను రూ. 42,500 తగ్గింపు ధరకు కొనుగోలు చేయొచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 6 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ 1272×2772 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. క్రిస్టల్ గార్డ్ సెక్యూరిటీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్ అందిస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. బ్యాక్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇందులో 112-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ మన్నిక అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్‌కు IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్ ఉంది. ఇందులో 9,000mAh బ్యాటరీ ఉంది. 80W సూపర్‌వూక్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
