OnePlus Nord 6 Sale : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 6 అతి చౌకైన ధరకే.. ఇలా కొన్నారంటే?
OnePlus Nord 6 Sale : వన్‌ప్లస్ నార్డ్ 6 ఫస్ట్ సేల్ మొదలైంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4, 9000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ 6 భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published On : April 10, 2026 / 01:08 PM IST
OnePlus Nord 6 Sale
- భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ 6 ఫస్ట్ సేల్
- ఈ ఫోన్‌లో 9000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
- బ్యాంకు ఆఫర్లతో రూ. 3000 వరకు తగ్గింపు ఆఫర్లు
వన్‌ప్లస్ అభిమానులకు బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ సేల్ మొదలైంది. ఇటీవలే భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఫీచర్లలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 12GB ర్యామ్, 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 9,000mAh బ్యాటరీ ఉన్నాయి.
ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. IP66, IP68, IP69, IP69K రేటెడ్ బిల్డ్‌లతో వస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 6 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరతో పాటు పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ నార్డ్ 6 ధర, ఆఫర్ :
వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999 కాగా, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 41,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రెష్ మింట్, పిచ్ బ్లాక్ క్విక్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో ఈ వన్‌ప్లస్ ఫోన్ అమ్మకాలు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్లు (ఫుల్ స్వైప్) యూజర్లు రూ. 2వేలు డిస్కౌంట్ పొందవచ్చు. కాగా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3వేలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 6 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ 6లో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1272×2772 పిక్సెల్స్, 165Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్, 450ppi పిక్సెల్ డెన్సిటీ, 93.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో 3840Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో క్రిస్టల్ గార్డ్ సెక్యూరిటీ ఫీచర్ ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. 4 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్ నార్డ్ 6లో అడ్రినో 825 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ఉంది.
ఇందులో 12GB LPDDR5X ర్యామ్ 256GB UFS 4.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఈ ఫోన్‌లో 33,147 చదరపు మిల్లీమీటర్ల హీట్ డిస్సిపేషన్ ఏరియా ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే..
వన్‌ప్లస్ నార్డ్ 6లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), ఎఫ్/1.8 అపర్చర్, పీడీఏఎఫ్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, 112-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ గల 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ప్లస్ కీ ఫీచర్ ఉంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు.
కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 6, 5G, జీపీఎస్, Wi-Fi, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెన్సార్లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, సిక్స్-యాక్సిస్ గైరోస్కోప్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉన్నాయి. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ మన్నికతో వస్తుంది.
ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో వస్తుంది. ఇందులో 9,000mAh బ్యాటరీ ఉంది. 80W సూపర్ వూక్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 162.5mm పొడవు, 77.5mm వెడల్పు, 8.5mm మందంతో 217 గ్రాముల బరువు ఉంటుంది.
