OnePlus Nord 6 : ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త వన్‌ప్లస్ నార్డ్ 6 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, రిలీజ్ డేట్ లీక్..

OnePlus Nord 6 : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వన్ ప్లస్ నుంచి సరికొత్త నార్డ్ 6 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్ కుముందుగానే కీలక ఫీచర్లు, రిలీజ్ డేట్ వివరాలు లీక్ అయ్యాయి..

OnePlus Nord 6

  • ఏప్రిల్ 7వ తేదీన వన్‌ప్లస్ నార్డ్ 6 లాంచ్ చేసే ఛాన్స్
  • స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్, 165Hz అమోల్డ్ డిస్‌ప్లే, భారీ 9,000mAh బ్యాటరీ అంచనా
  • భారత మార్కెట్లో ధర రూ. 34,999 నుంచి రూ. 40,000 మధ్య ఉండొచ్చు

OnePlus Nord 6 : వన్‌ప్లస్ అభిమానులకు ఎగిరిగంతేసే వార్త.. అతి త్వరలోనే వన్‌ప్లస్ నుంచి సరికొత్త నార్డ్ 6 మోడల్ రాబోతుంది. వన్‌ప్లస్ 15R లాంచ్ తర్వాత ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నెక్ట్స్ జనరేషన్ నార్డ్ సిరీస్‌ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ లైనప్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6, నార్డ్ CE 6 ఉండవచ్చు. నార్డ్ CE 6 అత్యంత సరసమైన ధరలో రావొచ్చు. నార్డ్ 6 మోడల్ వినియోగదారులను ఆకర్షించేలా ఉంటుందని భావిస్తున్నారు.

లీక్‌ల ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 6 డిజైన్ మార్పులతో పాటు పర్ఫార్మెన్స్, బ్యాటరీ, కెమెరా, డిస్‌ప్లేలో ఎక్కువగా అప్ గ్రేడ్ ఉండొచ్చునని అంచనా. గతంలో చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ టర్బో 6 రీబ్రాండెడ్ వెర్షన్ కూడా అంటున్నారు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

Read Also : iPhone 17 Pro Max : దిమ్మతిరిగే ఆఫర్ మావా.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. ఫుల్ డిటెయిల్స్

వన్‌ప్లస్ నార్డ్ 6 లాంచ్ తేదీ :
వన్‌ప్లస్ నార్డ్ 6 ఏప్రిల్ ఫస్ట్ వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 7న రిలీజ్ ఉండొచ్చు. కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఫోన్ వన్‌ప్లస్ ఇ-స్టోర్, అమెజాన్, ఇతర రిటైల్ ఛానల్ పార్టనర్ల వద్ద అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ 6 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ 6, వన్‌ప్లస్ నార్డ్ 5తో పోలిస్తే భారీ అప్‌గ్రేడ్‌.. 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 12GB వరకు LPDDR5X ర్యామ్, 256GB UFS 4.1 స్టోరేజ్ ఉండొచ్చు. ఈ డివైస్ 80W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 9,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుందని అంచనా.

కెమెరా విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ 6లో OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చు. ఈ వన్‌ప్లస్ ఫోన్ IP68/IP69 రేటింగ్‌లతో కూడా వస్తుందని అంచనా.

భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ 6 ధర (అంచనా) :
వన్‌ప్లస్ నార్డ్ 6 అధికారిక ధరల వివరాలు రివీల్ చేయలేదు. నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 6 బేస్ వేరియంట్ ధర రూ. 34,999 నుంచి రూ. 40,000 మధ్య ఉండొచ్చు. బ్లాక్, మింట్, సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లలో రావొచ్చు.