OnePlus Nord CE 6 : 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వన్‌ప్లస్ నార్డ్ CE 6.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర జస్ట్..

OnePlus Nord CE 6 : భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. 50ఎంపీ కెమెరా, 8000mAh బ్యాటరీతో పాటు ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.

OnePlus Nord CE 6

  • వన్‌ప్లస్ నార్డ్ సీఈ6లో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే
  • 50MP ప్రైమరీ కెమెరా, 8000mAh బ్యాటరీతో వస్తుంది
  • 8జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999

OnePlus Nord CE 6 : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? భారత మార్కెట్లో కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6లో 6.78-అంగుళాల 1.5కె అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఇందులో 8,000mAh బ్యాటరీ ఉంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు (OnePlus Nord CE 6) సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ధర ఎంతంటే? :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 ఫోన్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999 కాగా , 8జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999గా ఉంది. ఈ ఫోన్ మే 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్ ఇ-కామర్స్ సైట్ ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

లాంచ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ లావాదేవీలపై రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐలు కూడా అందుబాటులో ఉంటాయి.

Read Also : Amazon Great Summer Sale : అమెజాన్ మెగాసేల్ ఆఫర్లు.. ఈ ఐక్యూ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ6లో 2772×1272 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ 3840Hz, PWM డిమ్మింగ్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే క్రిస్టల్ గార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. అడ్రినో 810 జీపీయూతో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4, 4nm చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB, LPDDR4X ర్యామ్, 128GB/256GB యూఎఫ్ఎస్ 3.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 8000mAh బ్యాటరీతో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66/68/69/69K రేటింగ్‌ కూడా అందిస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
వన్‌ప్లస్ నార్డ్ CE 6 బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ OISతో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కొలతలు 162.5 మిమీ పొడవు, 77.5 మిమీ వెడల్పు, 8.5 మిమీ మందం, బరువు 215 గ్రాములు ఉంటుంది. మిలిటరీ-గ్రేడ్ మన్నిక కోసం ఎంఐఎల్-ఎస్టీడీ-810H సర్టిఫికేషన్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-సి 2.0 పోర్ట్ ఉన్నాయి.