Amazon Great Summer Sale : అమెజాన్ మెగాసేల్ ఆఫర్లు.. ఈ ఐక్యూ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Amazon Great Summer Sale 2026 : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రత్యేకించి ఐక్యూ ఫోన్లపై రూ. 11వేల తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు.
Amazon Great Summer Sale 2026
- అతి చౌకైన ధరకే ఐక్యూ 15, ఐక్యూ 15ఆర్, ఐక్యూ జెడ్11ఎక్స్, ఐక్యూ నియో 10 ఫోన్లు
- మే 8 నుంచి కస్టమర్ల కోసం కంపెనీ భారీ సేల్ ప్రారంభం కానుంది
- ఈ సేల్‌లో ఐక్యూ, వన్ ప్లస్, శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు
Amazon Great Summer Sale 2026 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభం కాబోతోంది. ఈ అమెజాన్ సేల్ మే 8వ తేదీ నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఇందులో అనేక పాపులర్ కంపెనీల స్మార్ట్ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్‌లో (Amazon Great Summer Sale) శాంసంగ్, రియల్‌మి, వివో వంటి ప్రముఖ బ్రాండ్లతో పాటు ఐక్యూ పాపులర్ బ్రాండ్ల ఫోన్లపై కూడా అదిరే డీల్స్ అందిస్తోంది.
మీరు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో ఐక్యూ ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అస్సలు వదులుకోవద్దు. ఐక్యూ 15, ఐక్యూ 15ఆర్, ఐక్యూ జెడ్11ఎక్స్, ఐక్యూ నియో 10 వంటి కంపెనీ పాపులర్ ఫోన్లు ఆకట్టుకునే ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. కంపెనీ ఈ భారీ సేల్ మే 8వ తేదీన ప్రైమ్ సభ్యులకు అందుబాటులోకి రానుంది. ఈ సేల్ సమయంలో ఐక్యూ, వన్‌ప్లస్, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉంటాయి.
కంపెనీ ప్రత్యేకంగా ఐక్యూ డీల్స్‌ను హైలైట్ చేసింది. ఐక్యూ 15ఆర్, ఐక్యూ 15, ఐక్యూ జెడ్11ఎక్స్, ఐక్యూ నియో 10 వంటి ఫోన్లతో సహా అనేక డీల్స్ రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్లకు సంబంధించి మేజర్ డీల్స్ ఓసారి లుక్కేయండి.
ఐక్యూ 15ఆర్ :
ఐక్యూ 15ఆర్ స్మార్ట్ఫోన్లలో ఇదొకటి. అమెజాన్ సేల్‌లో తక్కువ ధరకు లభిస్తోంది. కూపన్ ఆఫర్‌తో సహా కంపెనీ ఐక్యూ 15ఆర్ రూ. 42,999కి లిస్టు అయింది. ఈ ఫోన్ ధర రూ. 53,999గా ఉంది. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్ ఉంది. 7.9mm మందంతో స్లిమ్ ఫోన్ భారీ 7600mAh బ్యాటరీ ఉంది. 1.5K 144Hz అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది.
ఐక్యూ నియో 10 :
ఐక్యూ నియో 10 ఫోన్ రూ. 34,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఐక్యూ 15 ఫోన్ కూడా ఒకటి. 6000 నిట్స్ బ్రైట్నెస్ శాంసంగ్ 2K M14 ఎల్ఈడీ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీ ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అసలు ధర రూ. 76,999తో పోలిస్తే.. ఈ సేల్‌లో ఐక్యూ ఫోన్ ధర రూ. 66,999గా ఉంది.
అమెజాన్ సేల్ సమయంలో ఐక్యూ Z11x భారీ తగ్గింపుతో కొనేసుకోవచ్చు. సాధారణంగా ఈ ఐక్యూ ఫోన్ ధర రూ. 28,999 కాగా సేల్ సమయంలో రూ. 20,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లో 7200mAh బ్యాటరీ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో వస్తుంది. ఇందులో 50MP సోనీ మెయిన్ కెమెరా ఉంది.
