Google Pixel 10 : ఫ్లిప్‌కార్ట్‌లో కిర్రాక్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10పై భారీ తగ్గింపు.. జస్ట్ రూ. 20వేల కన్నా తక్కువకే..!
Google Pixel 10 : గూగుల్ ఈ ఫ్లాగ్షిప్ పిక్సెల్ ఫోన్‌ను గత ఏడాది ఆగస్టులో రూ. 79,999 ధరకు లాంచ్ చేయగా మే 9వ తేదీ నుంచి కేవలం రూ. 59,999కే లభించనుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Google Pixel 10
- 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అద్భుతమైన స్క్రీన్‌తో వస్తుంది
- ఈ పిక్సెల్ ఫోన్లో టెన్సర్ G5 ప్రాసెసర్ కూడా ఉంది
- ఎఫ్/1.7 అపర్చర్‌తో 48MP మెయిన్ కెమెరా అమర్చారు
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్. ఫ్లిప్‌కార్ట్ యూజర్ల కోసం కొత్త ‘సాసా లేలే సేల్’ ఆఫర్లను అందిస్తోంది. మే 9వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 10 ఫ్లాగ్షిప్ ఫోన్‌పై భారీ తగ్గింపు పొందవచ్చు.
పిక్సెల్ ఫోన్ రూ. 20వేల కన్నా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సేల్ ఆఫర్లను ఈ-కామర్స్ వెబ్సైట్ వెల్లడించింది. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ గతంలో ఎన్నడూ లేనంతగా అతి తక్కువ ధరకు లభిస్తోంది. ఈ అద్భుతమైన ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10 ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్ :
గూగుల్ పిక్సెల్ 10 తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రాబోయే ‘సాషా లేలే సేల్’ కోసం అదిరిపోయే ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 10 కూడా ఒకటి. గూగుల్ ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ గత ఏడాది ఆగస్టులో రూ. 79,999 ధరకు లాంచ్ చేసింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 59,999కే లభిస్తోంది. ఈ ఫోన్ రూ. 20వేలు తక్కువకే కొనుగోలు చేయవచ్చు.
బ్యాంక్ డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇంకా కొత్త ఆఫర్లను ప్రకటించలేదు. ఎస్బీఐ యూజర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈఎంఐ లావాదేవీలపై కూడా కంపెనీ ఈ ఆఫర్ అందిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 10లో 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల యాక్చువా ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అద్భుతమైన స్క్రీన్ అందిస్తుంది. ఈ ఫోన్ టెన్సర్ G5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 4970mAh బ్యాటరీ ఉంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 10W వైర్లెస్ ఛార్జింగ్ కూడా అందిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 10లో ఎఫ్/1.7 అపర్చర్‌తో 48MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్/3.1 అపర్చర్‌తో 10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 8.6mm మందంతో, 204 గ్రాముల బరువుతో వస్తుంది.
