Samsung Galaxy S24 FE : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. గెలాక్సీ S24 FEపై ఏకంగా రూ. 22వేలు తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే?
Samsung Galaxy S24 FE : కొత్త శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24 FE
- శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ 6.7-అంగుళాల అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే
- 50MP ప్రైమరీ కెమెరా, 5100mAh బ్యాటరీ, 10MP ఫ్రంట్ కెమెరా
- ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 17,400 వరకు ఆదా చేయొచ్చు
Samsung Galaxy S24 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. మీరు శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ శాంసంగ్ ఫోన్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 10MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 5100mAh బ్యాటరీతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ధర, ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ 8GB+128GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999 ధరకు లభిస్తోంది. సెప్టెంబర్ 2024లో రూ. 59,999 ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై రూ. 2వేలు డిస్కౌంట్ వంటి బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. తద్వారా ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 37,999కి తగ్గింది.
ఇప్పటికే ఉన్న శాంసంగ్ ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 17,400 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది ప్రస్తుత ఫోన్ వర్కింగ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారు రూ. 22వేలు తక్కువకు లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ఫోన్ 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లే అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5100mAh బ్యాటరీ అందిస్తుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-సిమ్ 5జీ, ఎల్టీఈ, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
