OpenAI Engineer : ఏఐ టెక్ కంపెనీలో ఎలా జాబ్ కొట్టాలో సూపర్ సీక్రెట్ చెప్పిన ఓపెన్ఏఐ ఇంజనీర్.. అదేంటో తెలిస్తే జాబ్ పక్కా..!

OpenAI Engineer : ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఆయన బృందం (IIIT) ఢిల్లీని సందర్శించారు. ఈ సమయంలో AI ఇంజనీర్ AI టెక్ కంపెనీలో ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలో ఒక సీక్రెట్ టిప్ రివీల్ చేశారు.

OpenAI Engineer reveals a secret tip to land a job at the AI tech company

OpenAI Engineer : ఏఐ టెక్ కంపెనీలో ఉద్యోగం రావాలంటే చాలా కష్టమే. ప్రస్తుత టెక్నాలజీకి తగినట్టుగా స్కిల్స్ ఉండాలి. అప్పుడే ఏఐ జాబ్ సంపాదించగలరు. ఏఐ ఉద్యోగులను ఎలా సంపాదించాలంటే.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఒక సూపర్ సీక్రెట్ టిప్ రివీల్ చేశారు. ఈ సీక్రెట్ టిప్ ఫాలో అయితే.. ఏఐ టెక్ కంపెనీలో ఈజీగా జాబ్ కొట్టవచ్చు అని అంటున్నారు. ఇటీవల (OpenAI CEO) సామ్ ఆల్ట్‌మాన్ ఆరు దేశాల పర్యటనలో భాగంగా భారత్‌లో సందర్శించారు.

ఈ పర్యటనలో భాగంలో ఆయన భారత్‌లో AI అభివృద్ధి, అవకాశాలపై భారతీయ ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఆయన భారత్‌లో ఏఐ టెక్నాలజీపై చర్చించారు. AI, OpenAI భవిష్యత్తు ప్రణాళికలపై లోతుగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సీఈఓ శామ్ ఆయన బృందం ఏఐ ఉద్యోగావకాశాలపై ప్రస్తావించారు. OpenAIలో ఉద్యోగం కోసం ఎలా దరఖాస్తు చేయాలి అనేదానిపై అనేక సలహాలు, సూచనలు చేశారు.

ఏఐ జాబ్‌కు అప్లయ్ చేయాలంటే? :
నివేదిక ప్రకారం.. చాట్‌జీపీటీ (ChatGPT) క్రియేటర్ ఆల్ట్‌మన్, ఆయన బృందం IIIT-ఢిల్లీలో విద్యార్థులతో సంభాషణ సందర్భంగా ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియపై వివరణ ఇచ్చారు. దీనిపై ఏఐ టీమ్ ఇంజనీర్‌లలో ఒకరు మాట్లాడుతూ.. ‘కొన్ని కూల్ ప్రొడక్టులను రూపొందించేందుకు OpenAI APIని ఉపయోగించండి. ఆపై సామ్‌కి పంపాలని సూచించారు. ఈ అసాధారణ విధానం అనేక ఏఐ అభ్యర్థులలో ఆచరణాత్మక AI పరిజ్ఞానం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.

Read Also : Motorola Edge 40 Vs Realme 11 Pro+ : అత్యంత సరసమైన మోటో ఎడ్జ్ 40, రియల్‌మి 11ప్రో.. భారత్‌లో ధర ఎంత? ఫీచర్లలో ఏది బెటర్?

ముఖ్యంగా, OpenAI API డెవలపర్‌లను కంపెనీ శక్తివంతమైన భాషా నమూనా, AI సామర్థ్యాలను యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. ఏఐ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగార్ధులు OpenAI APIని తమ సొంత ప్రాజెక్ట్‌లను క్రియేట్ చేయడానికి ఉపయోగించాలి. అదే నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఉపయోగించవచ్చు. ఆపై పూర్తి చేసిన తమ ప్రాజెక్టునుసీఈఓ శామ్ రివ్యూ కోసం పంపవచ్చు. ఆ తర్వాత కంపెనీలో ఉద్యోగాన్ని పొందే అవకాశాలను పెంచుకోవచ్చు.

OpenAI Engineer reveals a secret tip to land a job at the AI tech company

44 ఏఐ ఉద్యోగాల్లో ఖాళీలు :
OpenAIలో పని చేసే ఆసక్తి ఉంటే.. మీరు కంపెనీ వెబ్‌సైట్ కెరీర్ పేజీ ద్వారా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం, దాదాపుగా 44 ఉద్యోగ అవకాశాలు వెబ్‌సైట్‌లో లిస్టు అయ్యాయి. ప్రధానంగా శాన్ ఫ్రాన్సిస్కోలో చాలా ఖాళీలు ఇంజనీర్లు, శాస్త్రవేత్తల కోసమే ఉన్నాయి. మీకు ఆసక్తి ఉన్న ఉద్యోగాల కోసం మీరు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేసేందుకు మీరు తప్పనిసరిగా మీ పేరు, ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ వంటి కొన్ని ప్రాథమిక వివరాలను అందించాలి. మీరు కంపెనీలో చేరడానికి మీ రెజ్యూమ్‌ని జత చేయాలి. మీరు ఏ రోల్ కోసం ఉద్యోగం కావాలో అది కూడా సూచించాలి. ముఖ్యంగా, యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉన్న అభ్యర్థులకు, వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా ఇమ్మిగ్రేషన్, స్పాన్సర్‌షిప్ కోసం OpenAI సపోర్టును అందిస్తుంది.

మీరు లింక్‌డిన్ (LinkedIn) లేదా ఇతర సంబంధిత ప్లాట్‌ఫారమ్‌ల్లో మీ ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్రొఫైల్‌లకు లింక్‌లను కూడా చేర్చవచ్చు. మీ అసాధారణ సామర్థ్యాలకు సంబంధించిన వివరాలను కూడా అందులో ప్రస్తావించాలి. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలపై AI ప్రభావం గురించి కూడా మాట్లాడారు. అయినప్పటికీ, AI మార్పు కొత్త ఉద్యోగాలకు దారితీస్తుందనే వాస్తవాన్ని కూడా అంగీకరించారు. ఏఐ టెక్నాలజీతో రానున్న రోజుల్లో కొన్ని ఉద్యోగాలు పోనున్నాయని చెప్పారు.

కానీ, ఊహకు అందని కొత్త, మెరుగైన ఉద్యోగాలు (ప్రస్తుతం) అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఏఐ విప్లవం, సంబంధిత ప్రభావాలు భారతీయ ఉద్యోగులపై కూడా ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ChatGPT, Bard AI, Microsoft Bing AI వంటి జనరేటివ్ AI ప్లాట్‌ఫారమ్‌లు ఎంతో పాపులర్ అయ్యాయి. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ మరిన్ని కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : iPhone 13 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి.. డోంట్ మిస్..!