Oppo A5 Pro vs Vivo T4 : వివో కావాలా? ఒప్పో కావాలా? ఈ రెండు 5G ఫోన్లలో ఏది కొంటే బెటర్? మీదే ఛాయిస్..!

Oppo A5 Pro vs Vivo T4 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఒప్పో A5 ప్రో 5G, వివో T4 5G ఫోన్ రెండింటిలో ఏదైనా కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Oppo A5 Pro vs Vivo T4

Oppo A5 Pro 5G vs Vivo T4 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రూ.25వేల లోపు కొత్త 5G ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ఒప్పో A5 ప్రో 5G, వివో T4 5G అనే రెండు ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఒకటి పవర్-హిట్టర్, మరొకటి డిస్‌ప్లే స్టార్ ఫోన్.. ఫీచర్లు, పర్ఫార్మెన్స్ పరంగా ఒప్పో, వివో ఫోన్లలో ఏది తక్కువ కాదు.. అయితే, ఈ ఫోన్లలో ఏ ఫోన్ కొనాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Vivo X200 FE Launch : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. వివో S30 ప్రో మినీ రీబ్రాడెండ్ వెర్షన్ వస్తోందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

 ప్రాసెసర్, పర్పార్మెన్స్ :
ఒప్పో A5 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్, ఆక్టా-కోర్ 2.4 GHz ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 8GB ర్యామ్, 8GB వర్చువల్ బూస్ట్‌ను కూడా అందిస్తుంది. మరోవైపు, వివో T4 5జీ స్పీడ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 చిప్‌సెట్, 2.5 GHz ఆక్టా-కోర్ సెటప్‌తో వస్తుంది. రెండింటికీ 8GB ర్యామ్, వర్చువల్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లను మల్టీ టాస్కింగ్‌ కోసం వినియోగించవచ్చు. వివో గేమర్‌లకు ఇదే బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.

డిస్‌ప్లే, బ్యాటరీ :
ఒప్పో A5ప్రో ఫోన్ 6.67-అంగుళాల LCD స్క్రీన్‌తో HD ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. DCI-P3 సపోర్టుతో కలర్ ఆప్షన్ అందిస్తుంది. మరోవైపు, వివో T4 5G ఫోన్ 6.77-అంగుళాల స్క్రీన్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్‌తో అమోల్డ్ కలిగి ఉంది. SGS సర్టిఫికేషన్‌ కూడా కలిగి ఉంది. వివో బ్యాటరీ ఒప్పో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. వివో 90W సూపర్‌ఫాస్ట్ ఛార్జ్, రివర్స్ ఛార్జింగ్‌తో పాటు భారీ 7300mAh బ్యాటరీతో వస్తుంది.

కెమెరా ఫీచర్లు :
రెండు ఫోన్లలో (50MP+2MP) డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వివో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ ఒప్పో 8MP సెన్సార్‌ను కలిగి ఉంది. వివో 32MP సెన్సార్‌ను అందిస్తుంది. సోనీ IMX882 ఏఐ అసిస్టెన్స్, వివో సెల్ఫీలు, లో-లైటింగ్‌తో ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

ధర ఎంతంటే? :
అమెజాన్, క్రోమాలో ఒప్పో A5 ప్రో 5G ధర రూ.17,999కు పొందవచ్చు. ఏప్రిల్ 29 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి రానుంది. వివో T4 5G ఫోన్ ధర రూ. 21,999కు పొందవచ్చు. మీకు బడ్జెట్ తక్కువగా ఉంటే ఒప్పోను ఎంచుకోవచ్చు. కానీ, కొంచెం ఎక్కువ ఖర్చు చేస్తే వివో కూడా కొనుగోలు చేయొచ్చు.

Read Also : IRCTC Tour Package : వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీలివే.. ఇలా బుక్ చేసుకోవచ్చు!

బ్యాంక్ ఆఫర్లు ఇవే :
డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు షాపింగ్ చేసే ప్రాంతం ఆధారంగా అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు లేదా ఫ్లిప్‌‌కార్ట్ ఆధారిత పేమెంట్ చేస్తే.. క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఒప్పో A5 ప్రో 5G పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో సరసమైన ధరకే వస్తుంది. వివో T4 5జీ ఫోన్ డిస్‌ప్లే క్వాలిటీ, ఛార్జింగ్ స్పీడ్, ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.