Oppo A5 Pro 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో ఒప్పో A5 ప్రో 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!

Oppo A5 Pro 5G Launch : ఈ కొత్త ఒప్పో A5 ప్రో 5జీ ఫోన్ ప్రస్తుతం దేశంలో ఒప్పో చైనా ఇ-స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. డిసెంబర్ 27 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

Oppo A5 Pro 5G With 6,000mAh Battery Launched

Oppo A5 Pro 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త A5 ప్రో 5జీ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్‌తో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ 360-డిగ్రీ డ్రాప్ రెసిస్టెన్స్, -35 డిగ్రీల వరకు అత్యంత లో టెంపరేచర్ నిరోధకతను కలిగి ఉందని పేర్కొన్నారు. ఒప్పో ఎ5ప్రో ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 80డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ నెలాఖరున అమ్మకానికి వస్తుందని అంచనా.

Read Also : iPhone 15 Plus Price Drop : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్ ధరపై భారీ తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

ఒప్పో ఎ5 ప్రో 5జీ ధర, కలర్ ఆప్షన్లు :
చైనాలో ఒప్పో ఎ5 ప్రో 5జీ ఫోన్ 8జీబీ+ 256జీబీ ఆప్షన్ ధర సీఎన్‌వై 1,999 (సుమారు రూ. 23,300) నుంచి ప్రారంభమవుతుంది. 8జీబీ+ 512జీబీ 12జీబీ + 256జీబీ వేరియంట్‌లు రెండూ సీఎన్‌వై 2,199 (దాదాపు రూ. 25,700) వద్ద జాబితా అయింది. టాప్-ఆఫ్-లైన్ 12జీబీ + 512జీబీ వెర్షన్ సీఎన్‌వై 2,499 (దాదాపు రూ. 29,200) వద్ద మార్క్ అయింది.

ఈ ఫోన్ ప్రస్తుతం దేశంలో ఒప్పో చైనా ఇ-స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంది. డిసెంబర్ 27 నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మొత్తం న్యూ ఇయర్ రెడ్, క్వార్ట్జ్ వైట్, రాక్ బ్లాక్, సాండ్‌స్టోన్ పర్పుల్ అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఒప్పో ఎ5 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు :
డ్యూయల్ నానో సిమ్-సపోర్టుతో ఒప్పో ఎ5 ప్రో 5జీ పైన ఆండ్రాయిడ్ 15-ఆధారిత కలర్ఓఎస్ 15 స్కిన్‌తో అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం స్థాయి, 2,160Hz హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్ఓసీ ద్వారా 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో ఎ5ప్రో 5జీ 50ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్‌ను ఎఫ్/1.8 ఎపర్చరు, ఓఐఎస్, ఆటోఫోకస్ సపోర్ట్‌తో పాటు ఎఫ్/2.4 ఎపర్చర్‌ 2ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్‌ కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16ఎంపీ సెన్సార్‌ ఎఎఫ్/2.4 ఎపర్చరు కలిగి ఉంది.

ఒప్పో ఎ5 ప్రో 5జీ ఫోన్ 6,000mAh బ్యాటరీని 80డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ వోల్టే, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 5, బ్లూటూత్ 5.4, Beidou, GPS, GLONASS, గెలీలియో, QZSS, NFC, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సెక్యూరిటీ విషయానికి వస్తే.. హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్ డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తుంది.

ఒప్పో ఎ5 ప్రో 5జీ ఫోన్ క్వార్ట్జ్ వైట్, రాక్ బ్లాక్ వేరియంట్‌లు 161.50 x 74.85 x 7.55మిమీ, బరువు 180గ్రాములు. న్యూ ఇయర్ రెడ్, సాండ్‌స్టోన్ పర్పుల్ వెర్షన్‌లు 7.67మిమీ ప్రొఫైల్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 186 గ్రాములు ఉంటుంది.

Read Also : Vivo X200 Series First Sale : వివో X200 సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర, ఆఫర్లు వివరాలివే..!