Oppo A6x 5G Launch
Oppo A6x 5G Launch : ఒప్పో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒప్పో నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఒప్పో A6x 5జీ వచ్చేసింది. భారత మార్కెట్లో ఈ ఫోన్ 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. LCD స్క్రీన్, మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్, 6,500mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఒప్పో ఫోన్ (Oppo A6x 5G Launch) ఆండ్రాయిడ్ 15-ఆధారిత కలర్OS 15పై రన్ అవుతుంది. ఒప్పో A6x 5G ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ధరపై ఓసారి లుక్కేయండి.
భారత్‌లో ఒప్పో A6x 5G ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఒప్పో A6x 5G ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.12,499కు పొందవచ్చు. హై-ఎండ్ 4GB ర్యామ్, 128GB మోడల్ ధర రూ.13,499కు పొందవచ్చు. టాప్-ఆఫ్-ది-లైన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999కు పొందవచ్చు.
టెక్ కంపెనీ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. ఈ కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌లతో సహా మల్టీ ఆన్‌లైన్ రిటైల్ ఛానెల్స్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఒప్పో ఫోన్ ఐస్ బ్లూ, ఆలివ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఒప్పో A6x 5జీ ఫోన్ డ్యూయల్-సిమ్ హ్యాండ్‌సెట్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15పై రన్ అవుతుంది. HD+ (720×1,570 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో 6.75-అంగుళాల LCD స్క్రీన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 256ppi పిక్సెల్ డెన్సిటీ, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 1,125 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. డిస్‌ప్లే 16.7 మిలియన్ కలర్లు, 83 శాతం DCI-P3 కలర్ గాముట్ 100 శాతం sRGBని కూడా కలిగి ఉంది.
ఒప్పో A6x 5జీ ఫోన్ HD+ (720×1,570 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.75-అంగుళాల LCD స్క్రీన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 256ppi పిక్సెల్ డెన్సిటీ, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 1,125 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. డిస్‌ప్లే 16.7 మిలియన్ కలర్లు, 83శాతం DCI-P3 కలర్ గాముట్ 100శాతం sRGBని కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15పై రన్ అవుతుంది. ఒప్పో A6x 5G ఫోన్ డ్యూయల్-సిమ్ (నానో) హ్యాండ్‌సెట్.
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఏఆర్ఎం మాలి-G57 MC2 జీపీయూతో వస్తుంది. 6GB వరకు LPDDR4x ర్యామ్, 128GB వరకు UFS2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్ 45W వైర్డు సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఒప్పో A6x 5Gలో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్ యాక్సిలెరోమీటర్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఫేస్ ఐడెంటిఫికేషన్ సపోర్టు కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్ 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ఒప్పో ఫోన్ 166.6×78.5×8.6mm కొలతలు, సుమారు 212 గ్రాముల బరువు ఉంటుంది.
కెమెరా ఎలా ఉందంటే?:
కెమెరాల విషయానికొస్తే.. ఒప్పో A6x 5Gలో f/2.2 అపెర్చర్, 77-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆటోఫోకస్‌తో కూడిన 13MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.2 అపెర్చర్ 77-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్ కెమెరా సెన్సార్ 1080p వీడియోను 60fps వరకు రికార్డ్ చేయగలదు. సెల్ఫీ కెమెరా 1080p వీడియోను 30fps వద్ద షూట్ చేయగలదు.