Oppo A79 5G Launch in India : 50ఎంపీ కెమెరా ఫీచర్లతో ఒప్పో A79 5G వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Oppo A79 5G Launch in India : కొత్త ఫోన్ కొనుగోలు చేస్తున్నారా? ఒప్పో నుంచి 50ఎంపీ కెమెరాలతో సరికొత్త మోడల్ A79 సిరీస్ వచ్చేసింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Oppo A79 5G With MediaTek Dimensity 6020 SoC, 50-Megapixel Camera Debuts in India

Oppo A79 5G Launch in India : ఒప్పో A79 5G ఫోన్ భారత మార్కెట్లో ఎ-సిరీస్ లైనప్‌లో సరికొత్త ఆఫర్‌గా లాంచ్ అయింది. ఈ కొత్త 5G ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సీటీ 6020 SoC ద్వారా ఆధారితంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ఉంటుంది. ఒప్పో A79 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను సెంటర్ హోల్ పంచ్ కటౌట్‌తో కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది.

33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. బ్యాటరీ గరిష్టంగా 26 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది. ఒప్పో A79 5జీ, ఒప్పో A78 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5G, వివో T2 5జీ, శాంసంగ్ గెలాక్సీ M34 5G వంటి వాటితో పోటీపడుతుంది.

Read Also : Tata iPhone Maker : టాటా ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఐఫోన్ల తయారీ, అసెంబ్లింగ్ అంతా భారత్‌లోనే.. ఇదిగో క్లారిటీ..!

భారత్‌లో ఒప్పో A79 5G ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో కొత్త ఒప్పో A79 5G ఫోన్ సింగిల్ 8GB ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999, గ్లోయింగ్ గ్రీన్, మిస్టరీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది. ప్రస్తుతం ఒప్పో ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఒప్పో A79 5జీపై సేల్ ఆఫర్‌లు SBI, ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్, IDFC ఫస్ట్, AU ఫైనాన్స్ బ్యాంక్, వన్ కార్డ్, BoB కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లలో రూ.3,333 నుంచి ప్రారంభమవుతాయి. నెలకు రూ. 3,333 దుకాణదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌పై రూ.4వేల కొనుగోలుతో ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు.

ఒప్పో A79 5G స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్ సిమ్ (నానో) ఒప్పో A79 5G ఫోన్ ColorOS 13.1పై రన్ అవుతుంది. 6.72-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో గరిష్టంగా 90Hz రిఫ్రెష్ రేట్, 391ppi పిక్సెల్ డెన్సిటీ, 6150నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 9150 నిట్స్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 7nm మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC, 8GB LPDDR4X RAM, 128GB UFS2.2 స్టోరేజ్‌తో అందిస్తుంది. RAM విస్తరణ ఫీచర్‌తో స్టోరేజీ ద్వారా మెమరీని 16GB వరకు వర్చువల్‌గా విస్తరించవచ్చు.

Oppo A79 5G Smartphone in India

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో A79 5G డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరు, 77 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 2MP సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లతో f/2.0 అపెర్చర్ లెన్స్‌తో 8MP ఫ్రంట్ ఫేసింగ్ స్నాపర్ ఉంది. ఒప్పో A79 5Gలోని కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్ 5.3, 3.5ఎంఎం, ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్, USB ఓటీజీ, జీపీఎస్, A-GPS ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, పెడోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.

అథెంటికేషన్ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఒప్పో A79 5G ఫోన్ 5,000mAh బ్యాటరీతో 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇందులోని, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ 30 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 51 శాతానికి పెరుగుతుంది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. గరిష్టంగా 26 గంటల వరకు మాట్లాడే సమయాన్ని, గరిష్టంగా 14 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 165x76x7.9మీ.మీ, బరువు 193 గ్రాములు ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IPX4 రేటింగ్‌ను కూడా అందిస్తుంది.

Read Also : Amazon Festival Sale 2023 : అమెజాన్‌ ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి