Oppo F27 Pro Plus 5G available for sale starting today ( Image Source : Google )
Oppo F27 Pro Plus 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. ఒప్పో లేటెస్ట్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్, ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ ఇప్పుడు భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఒప్పో స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయిస్తోంది. 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.29,999కు పొందవచ్చు.
Read Also : Citroen C3 Aircross Car : సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ వచ్చేసిందోచ్.. ఈ కారు ధర ఎంతో తెలుసా?
ప్రత్యేకమైన లాంచ్ ఆఫర్లు :
ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీని కొనుగోలు చేసే కస్టమర్‌లు అనేక ప్రత్యేకమైన ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత 180 రోజుల వరకు రూ. 999 విలువైన వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ పొందవచ్చు. బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ క్రెడిట్ ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి భాగస్వాములతో 6 నెలల వరకు ఎలాంటి ధర లేని ఈఎంఐ 9 నెలల వరకు వినియోగదారుల రుణాలు ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా పొందవచ్చు.
ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ అప్‌గ్రేడ్ అయ్యే వారికి రూ. 1000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఇప్పటికే ఉన్న ఒప్పో కస్టమర్‌లకు రూ. 1000 విలువైన అదనపు లాయల్టీ బోనస్ పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్‌లు, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై ఫ్లాట్ 10శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
స్టైలిష్ డిజైన్ ఫీచర్లు :
ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ అత్యంత మన్నికైన 360-డిగ్రీ ఆర్మర్ బాడీని కలిగి ఉంది. స్విస్ ఎస్‌జీఎస్ ప్రీమియం పర్ఫార్మెన్స్ 5 స్టార్ రేటింగ్, ఎమ్ఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ మెథడ్ 516.8 సర్టిఫికేషన్‌ను పొందింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో అమర్చి ఉంది. ముందున్న దానికన్నా డ్రాప్ రెసిస్టెన్స్‌లో 180శాతం మెరుగుదలని అందిస్తుంది.
ప్రమాదవశాత్తు డ్రాప్స్, స్క్రాచ్‌ల నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మూడు ఐపీ రేటింగ్‌లను కలిగి ఉన్న మొదటిది. అత్యధిక స్థాయిలో నీటి నిరోధకతను సూచిస్తుంది. అదనంగా, ఒప్పో స్ప్లాష్ టచ్ టెక్నాలజీ డిస్‌ప్లే లేదా తడి చేతులతో ఉపయోగించినప్పుడు కూడా స్క్రీన్ అనుమతిస్తుంది.
ఆకట్టుకునే బ్యాటరీ, పర్ఫార్మెన్స్ :
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. నాలుగు ఏళ్ల పాటు అందిస్తుంది. 67డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ త్వరగా పూర్తి శక్తిని పొందగలదు. హుడ్ కింద, ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ 7050ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ఇందులో 2.6GHz వరకు క్లాక్ చేసిన ఏఆర్ఎమ్ కార్టెక్స్-A78 కోర్లు, కార్టెక్స్-A55 ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. ఈ కలయికతో మల్టీ టాస్కింగ్, పవర్ మేనేజ్‌మెంట్, రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
అద్భుతమైన డిస్‌ప్లే :
స్మార్ట్‌ఫోన్ ఎఫ్ సిరీస్‌కి 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను ప్రవేశపెట్టింది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 93శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో వ్యూఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. 10-బిట్ కలర్ ప్యానెల్ బిలియన్ కన్నా ఎక్కువ కలర్లను డిస్‌ప్లే చేస్తుంది. 950 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో స్క్రీన్ డిస్‌ప్లే అందిస్తుంది.