Oppo Find N3 Flip Launch : ఒప్పో నుంచి ట్రిపుల్ కెమెరాలతో మడతబెట్టే ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ధర ఎంతంటే?

Oppo Find N3 Flip Launch : ఒప్పో నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. 50MP ట్రిపుల్ కెమెరాలతో క్లామ్‌షెల్-స్టయిల్ ఫోల్డబుల్‌గా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర ఎంతో తెలుసా?

Oppo Find N3 Flip With 50-Megapixel Triple Rear Cameras, Alert Slider Launched in India

Oppo Find N3 Flip Launch : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో (Oppo) నుంచి సరికొత్త క్లామ్‌షెల్-స్టయిల్ ఫోల్డబుల్‌గా ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 12GB RAMతో పాటు MediaTek ఆక్టా-కోర్ డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఒప్పో ఫ్లిప్ 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 3.26-అంగుళాల కవర్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.80-అంగుళాల ఇంటర్నల్ స్క్రీన్, సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 32MP కెమెరా కూడా కలిగి ఉంది.

భారత్‌లో ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ ధర, లభ్యత :
భారత మార్కెట్లో ఒప్పో Find N3 ఫ్లిప్ సింగిల్ 12GB + 256GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 94,999గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్రీమ్ గోల్డ్, మిస్టీ పింక్, స్లీక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్‌లలో అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటలకు విక్రయిస్తోంది. ఒప్పో వినియోగదారులకు అదనంగా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ రూ. 8వేల వరకు తగ్గింపు కూడా ఉంటుంది. రూ. 12వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో (Oppo India) ఫైండ్ N2 ఫ్లిప్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ. 8GB + 256GB మోడల్ ధర 89,999గా ఉంది. ఒప్పో లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ భారత మార్కెట్లో Samsung Galaxy Z Flip 5, Motorola Razr 40 Ultraతో పోటీపడుతుంది.

Read Also : Royal Enfield Meteor 350 : కుర్రాళ్ల డ్రీమ్ బైక్.. కొత్త వేరియంట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 బుల్లెట్.. టాప్ ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్-సిమ్ (Nano+eSIM) ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ ఒప్పో ColorOS 13.2 స్కిన్‌తో Android 13లో రన్ అవుతుంది. 6.8-అంగుళాల ఫుల్-HD (1,080×2,520పిక్సెల్‌లు) LTPO AMOLED ఇంటర్నల్ స్క్రీన్‌ను 1Hz, 120Hz మధ్య ఉండే డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 1,600 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. 3.26-అంగుళాల (382×720 పిక్సెల్‌లు) కవర్ డిస్‌ప్లే 900 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 చిప్‌తో ARM ఇమ్మోర్టాలిస్-G715 MC11 GPUతో పనిచేస్తుంది. 12GB LPDDR5X RAM 256GB UFS 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగి ఉంది. చైనాలో లాంచ్ అయిన 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ భారత మార్కెట్లో అందుబాటులో ఉండదు.

Oppo Find N3 Flip Launched in India

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో మొదటి క్లామ్‌షెల్-శైలి ఫోల్డబుల్ ఫోన్‌గా ఒప్పో ఫైండ్ N3 Flip సోనీ IMX890 సెన్సార్, f/1.8 ఎపర్చర్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరాతో వచ్చింది. సోనీ IMX581 సెన్సార్, f/2.2 ఎపర్చరుతో కూడిన 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే, సోనీ IMX709 సెన్సార్, f/2.0 ఎపర్చర్‌తో కూడిన 32MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లో ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ 32MP కెమెరాను లోపలి స్క్రీన్‌పై ఉంది. సోనీ IMX709 RGBW సెన్సార్‌తో f/2.4 ఎపర్చరు ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్ సెటప్ ఉంది.

ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, గ్రావిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ కంపాస్ ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 44W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,300mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్ ఫోల్డ్ చేస్తే.. 85.54×75.78×16.45mm, ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు 166.2×75.78×7.79mm, 198g బరువు ఉంటుంది.

Read Also : Kia EV5 electric SUV : 2023 కియా ఈవీ డే.. కొత్త ఈవీ EV5 SUV కారు అదుర్స్.. ఈ కారులో ఫ్రిడ్జ్, సీట్లను బెడ్ రూమ్‌గా మార్చుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు