Oppo Find X10 Series : ఒప్పో ఫ్యాన్స్ కోసం ఫైండ్ X10 సిరీస్ వచ్చేస్తోంది.. ట్రిపుల్ 200MP కెమెరా కేక.. ఫుల్ డిటెయిల్స్!
Oppo Find X10 Series : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్, అతి సన్నని బెజెల్స్‌తో 6.89-అంగుళాల 2K ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17పై రన్ అవుతుందని భావిస్తున్నారు.
- Sreehari A
- Published on- July 13, 2026 / 09:31 PM IST
Oppo Find X10 Series
- ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ కెమెరా యూనిట్‌లో భారీ అప్‌గ్రేడ్
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉండొచ్చు
- 6.89-అంగుళాల 2K ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్‌ప్లే కూడా ఉండే ఛాన్స్
Oppo Find X10 Series : ఒప్పో యూజర్లకు గుడ్ న్యూస్.. ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఒప్పో ఫైండ్ X10 సిరీస్‌లో బేస్ మోడల్ ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మాక్స్ ఉంటాయని అంచనా. ఈ ఏడాది కంపెనీ అత్యంత పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌గా ఒప్పో ఫైండ్ X10 ప్రో మాక్స్ ఉండొచ్చు. ఒప్పో ఫైండ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ కెమెరా యూనిట్ భారీ అప్‌గ్రేడ్‌తో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఇంజనీరింగ్ ప్రోటోటైప్‌ను 200MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఈ కెమెరా సెటప్‌లో 200MP ప్రైమరీ కెమెరా, 200MP అల్ట్రా-వైడ్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రో సిరీస్ ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X10 ప్రో మ్యాక్స్ ఫోన్ 144 Hz రిఫ్రెష్ రేట్, అతి సన్నని బెజెల్స్‌తో 6.89-అంగుళాల 2K ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17పై రన్ అవుతుందని భావిస్తున్నారు.
Read Also : Term Insurance : విదేశాల్లో మరణిస్తే భారత్‌లో ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందా? ప్రతి NRI తప్పక తెలుసుకోండి..!
ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 3MP మల్టీస్పెక్ట్రల్ కెమెరా కూడా ఉండొచ్చనని అంచనా. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో బ్యాటరీ అప్‌గ్రేడ్‌లు కూడా ఉండొచ్చు. ఒప్పో ఫైండ్ X10 సిరీస్ 8,000mAh రేంజ్ బ్యాటరీతో వస్తుందని అంచనా. ఒప్పో ఫైండ్ X9 సిరీస్ గత ఏడాది చైనాలో లాంచ్ అయింది.
ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా, ఒప్పో ఫైండ్ X9s ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రాలో 6.82-అంగుళాల QHD+ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లే (1,440 × 3,168 పిక్సెల్స్) ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఇందులో అడ్రినో 840 జీపీయూ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమెరా యూనిట్‌లో 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 7,050mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
