Oppo Find X10 Series : ఒప్పో నుంచి దుమ్మురేపే ఫోన్లు.. కెమెరా, బ్యాటరీ చూస్తే వావ్ అనాల్సిందే!
Oppo Find X10 Series : ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ రాబోతుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్10, ఎక్స్10 ప్రో మ్యాక్స్ లాంచ్ కానున్నాయి. 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.. పూర్తి ఫీచర్ల వివరాలివే..
- Sreehari A
- Published on- September 6, 2026 / 03:43 PM IST
Oppo Find X10 Series
- ఒప్పో నుంచి కొత్త సిరీస్ వస్తోంది
- 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ సెటప్
- చైనీస్ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్ డేటాబేస్‌లో లిస్టింగ్
Oppo Find X10 Series : ఒప్పో లవర్స్ రెడీగా ఉన్నారా? అతి త్వరలో ఒప్పో నుంచి రెండు సరికొత్త ఫోన్లు రానున్నాయి. అన్ని బడ్జెట్ రేంజ్ ఆప్షన్లతో అత్యంత పాపులారిటీ పొందాయి. మీరు ఒప్పో కస్టమర్ అయితే మీకో శుభవార్త.. ఒప్పో ఫైండ్ X10 సిరీస్ ఈ నెల చివరిలో లాంచ్ కానుంది.
ఇటీవల చైనీస్ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్ డేటాబేస్‌లో PMW110, PMX110గా గుర్తించారు. బహుశా చూస్తుంటే ఒప్పో ఫైండ్ X10, ఫైండ్ X10 ప్రో మాక్స్ అయి ఉండవచ్చని పుకార్లు సూచిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. డైమెన్సిటీ 9 సిరీస్‌కు భిన్నమైన చిప్‌సెట్‌లతో వస్తుంది. అయితే, ఒప్పో ఫైండ్ X10, X10 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
గీక్‌బెంచ్‌లో లిస్టింగ్ :
స్క్రీన్‌షాట్‌ల ప్రకారం.. పీఎండబ్ల్యూ110 (ఫైండ్ X10) PMX110, (ఫైండ్ X10 ప్రో మాక్స్) గీక్‌బెంచ్‌లో బెంచ్‌మార్కింగ్‌లో కనిపించాయి. ఈ రెండు ఫోన్లు 16GB ర్యామ్, ఆండ్రాయిడ్ 17 పై వర్క్ చేస్తాయని అంచనా.
అదనంగా, ఒప్పో ఫైండ్ X10 ఫోన్ గ్రాఫిక్స్ కోసం మాలి-జీ1-అల్ట్రా ఎంసీ12 జీపీయూని వాడే మీడియాటెక్ MT6993 చిప్‌తో రన్ అవుతుంది. స్టాండర్డ్ మోడల్‌లో 2025లో విడుదల అయిన 3nm ఫ్లాగ్‌షిప్ చిప్ డైమెన్సిటీ 9500 ఉంటుంది.
ఒప్పో ఫైండ్ X10 ప్రో మ్యాక్స్‌లో మీడియాటెక్ MT6995 చిప్‌ను అమర్చనున్నారు. కోర్ కాన్ఫిగరేషన్‌లో 3.10GHz క్లాక్ స్పీడ్‌తో 3 కోర్లు, 4.35GHz క్లాక్ స్పీడ్‌తో 3 కోర్లు, 4.55GHz క్లాక్ స్పీడ్‌తో 2కోర్లు ఉంటాయి. మాలి-జీ2-అల్ట్రా-NX MC12 జీపీయూ గ్రాఫిక్స్‌ను అందిస్తుంది.
ఈ చిప్ అధికారిక మార్కెటింగ్ పేరు ఇంకా రివీల్ కాలేదు. మీడియాటెక్ ఫస్ట్ 2nm చిప్ కానుంది. డైమెన్సిటీ 9600 లేదా డైమెన్సిటీ 9600 ప్రో బ్రాండింగ్ చేయొచ్చు. ఒప్పో ఫైండ్ X10 సిరీస్‌లో ఫైండ్ X10E అనే ఎంట్రీ-లెవల్ మోడల్ కూడా రానుందని నివేదికలు చెబుతున్నాయి.
Read Also : Jio vs Airtel vs Vi : రూ.1 తేడా.. బెనిఫిట్స్‌లో భారీ తేడా! జియో, ఎయిర్‌టెల్, Viలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఇదే
స్పెసిఫికేషన్లు (అంచనా) :
లీకుల ప్రకారం.. ఒప్పో ఫైండ్ X10 చాలా సన్నని బెజెల్స్‌తో 6.59-అంగుళాల 1.5K డిస్‌ప్లేతో రానుంది. ఈ ఒప్పో ఫోన్ ప్రకారం.. మీడియాటెక్ డైమెన్సిటీ 9600 సిరీస్ లేదా డైమెన్సిటీ 9500 ప్లస్ చిప్‌సెట్‌తో రన్ అవ్వొచ్చు.
12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడా రావచ్చు. ఈ ఫోన్‌లో భారీ 8,000mAh బ్యాటరీ ఉండొచ్చు. 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కలర్‌ఓఎస్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 17పై రన్ అవుతుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్ X10లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 200MP పెరిస్కోప్ సెన్సార్, 200MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా ఉండొచ్చు.
ధర (అంచనా) :
ఈ ఒప్పో ఫోన్ ధర వివరాలు రివీల్ కాలేదు. ఒప్పో నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే మరిన్ని ఫీచర్లు, ధర వివరాలు తెలిసే అవకాశం ఉంది.
