Oppo Find X8 Launch : ఒప్పో ఫైండ్ X8 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్..!

Oppo Find X8 Specifications : ఒప్పో ఫైండ్ ఎక్స్8 5,700mAh బ్యాటరీతో పాటు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లో 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పాటు యాజమాన్య వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ప్యాక్ చేసే అవకాశం ఉంది.

Oppo Find X8 Launch

Oppo Find X8 Specifications : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో సరికొత్త ఫోన్ రాబోతుంది. ఒప్పో ఫైండ్ X8 సిరీస్ రాబోయే వారాల్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా హ్యాండ్‌సెట్‌ల లీక్‌కు సంబంధించిన అనేక వివరాలు రివీల్ అయ్యాయి. టిప్‌స్టర్ ప్రకారం.. ఇప్పుడు బేస్ మోడల్ ఒప్పో ఫైండ్ ఎక్స్8 మోడల్ ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. మీడియాటెక్ నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్‌తో పాటు రానుంది. చైనాలో ఒప్పో ఫైండ్ ఎక్స్7 అప్‌గ్రేడ్ లీక్ ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి.

ఒప్పో ఫైండ్ ఎక్స్8 స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
వెయిబో వినియోగదారు స్మాల్ టౌన్ అసెస్‌మెంట్ రాబోయే ఒప్పో ఫైండ్ ఎక్స్8 వివరాలను చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో లీక్ చేసింది. డైమెన్సిటీ 9400 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. అక్టోబర్ 9న మీడియాటెక్ ద్వారా ఆవిష్కరించనుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. కంపెనీ కలర్ఓఎస్ 15 స్కిన్ పైనా ఉంటుంది. టిప్‌స్టర్ ప్రకారం.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 సన్నని డిస్‌ప్లే బెజెల్స్‌తో పాటు బీఓఈ ద్వారా ఉత్పత్తి చేసిన 6.5-అంగుళాల 1.5కె స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ గ్లాసుతో వస్తుంది.

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. టెలిఫోటో కెమెరా 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌ను కలిగి ఉంటుందని లీకైన డేటా సూచిస్తుంది. ట్విట్టర్ యూజర్ ఒప్పో ఫైండ్ ఎక్స్8 లైవ్ ఫొటోలను షేర్ చేశారు. ఫోన్ డిస్‌ప్లే, మధ్యలో చేసిన వృత్తాకార బ్యాక్ కెమెరా మాడ్యూల్ హ్యాండ్‌సెట్ మెటాలిక్ సైడ్‌లను సూచిస్తుంది. ఈ ఫొటో కనిపిస్తున్న డిజైన్ ఒప్పో ఫైండ్ సిరీస్ ప్రొడక్ట్ హెడ్ టీజ్ చేసిన హ్యాండ్‌సెట్ మాదిరిగానే ఉంది.

వెయిబోలో టిప్‌స్టర్ షేర్ చేసిన ప్రకారం.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 5,700mAh బ్యాటరీతో పాటు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లో 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పాటు యాజమాన్య వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ప్యాక్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో ట్రై-స్టేట్ అలర్ట్ స్లైడర్‌తో పాటు డెడికేటెడ్ బటన్ కూడా ఉంటుందని కూడా సూచిస్తుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్8 అక్టోబర్ 21న చైనాలో లాంచ్ కావచ్చని కూడా లీక్ డేటా పేర్కొంది. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, బ్లూ, పింక్ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫైండ్ ఎక్స్8 సిరీస్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.

Read Also : iPhone 13 Price Drop : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!