×
Ad

Oppo Find X8 Pro : అద్భుతమైన డిస్కౌంట్.. సరసమైన ధరకే ఒప్పో ఫైండ్ X8 ప్రో.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!

Oppo Find X8 Pro : ఒప్పో ఫైండ్ X8 ప్రో తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా ఆర్డర్ చేయడమే.. అది ఎలాగంటే?

Oppo Find X8 Pro

Oppo Find X8 Pro : కొత్త ఒప్పో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇందులో ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రో ఉన్నాయి. గత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫైండ్ X8 ప్రో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకే ధర లభిస్తోంది.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే.. ఈ ఫైండ్ X8 ప్రో సరసమైన ధరకు సొంతం (Oppo Find X8 Pro) చేసుకోవచ్చు. ఒప్పో ఫైండ్ X8 ప్రో కెమెరా సెటప్, లాంగ్ బ్యాటరీ లైఫ్, స్టైలిష్ డిజైన్‌ కలిగి ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ అన్ని హై-ఎండ్ ఫీచర్లు కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర రూ.99,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఒప్పో ఫోన్ రూ.15వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర నుంచి రూ.84,999కు తగ్గింది. దాంతో పాటు, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.4,500 అదనపు డిస్కౌంట్‌ పొందవచ్చు.

Read Also : Apple iPhone 16 Plus : కిర్రాక్ ఆఫర్ భయ్యా.. ఐఫోన్ 16 ప్లస్ ధర మళ్లీ తగ్గిందోచ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X8 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 5,910mAh బ్యాటరీ, 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్ X8 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 4,500 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ డాల్బీ విజన్ సపోర్ట్‌ కలిగి ఉంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఒప్పో ఫైండ్ X8 ప్రో బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ LYT808 ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్‌ అందించే 50MP సోనీ IMX858 సెన్సార్, 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంది.