Oppo Find X9 Series
Oppo Find X9 Series : ఒప్పో లవర్స్‌కు గుడ్ న్యూస్.. నవంబర్ 18న భారత మార్కెట్లోకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రో సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 7500mAh బ్యాటరీ ప్యాక్, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి.
పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్ (Oppo Find X9 Series) ద్వారా పవర్ పొందుతాయి. 200MP వరకు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండొచ్చు. ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి లాంచ్ డేట్, అన్ని ఫీచర్లు, ధరల వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఒప్పో ఫైండ్ X9, X9 ప్రో ధర :
12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 74,999 ఉండొచ్చు. అలాగే, ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 99,999 ఉండొచ్చు. అయితే, లాంచ్ తర్వాత మాత్రమే అసలు ధర ఎంత అనేది క్లారిటీ రానుంది.
ఒప్పో ఫైండ్ X9, X9 ప్రో కెమెరా సెటప్ :
ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ పరిశీలిస్తే.. 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP టెలిఫోటో కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ మీకు 32MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. మరోవైపు, ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉండొచ్చు.
బ్యాటరీ ప్యాక్ ఏంటి? :
బ్యాటరీ విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ 7025mAh బ్యాటరీ ప్యాక్ పొందే అవకాశం ఉంది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మరోవైపు, ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్ అదే ఛార్జింగ్ స్పెషిఫికేషన్లతో భారీ 7500mAh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది.
ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ :
ప్రస్తుతానికి, ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌తో రానున్నాయి. రోజువారీ వినియోగం, భారీ గేమింగ్‌కు అద్భుతంగా ఉంటుందని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ColorOS16తో ఆండ్రాయిడ్ 16లో రన్ అయ్యే అవకాశం ఉంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 నాన్-ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌తో వస్తాయి.