Maruti Grand Vitara : బిగ్ అలర్ట్.. మారుతి గ్రాండ్ విటారా రీకాల్.. మీ SUV కారులో ఈ సమస్య ఉందా? వెంటనే ఇలా చెక్ చేసుకోండి..!
Maruti Grand Vitara : మారుతి సుజుకి డిసెంబర్ 9, 2024 ఏప్రిల్ 29, 2025 మధ్య తయారు చేసిన గ్రాండ్ విటారా మోడళ్లను రీకాల్ చేసింది. మీ కారు ఎఫెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోండి.
Maruti Grand Vitara
Maruti Grand Vitara Recall : మారుతి సుజుకి గ్రాండ్ విటారా కస్టమర్లకు అలర్ట్.. మీ కారులో ఇలాంటి ఇంజిన్ సమస్య ఉందా? అయితే, డోంట్ వర్రీ.. మారుతి సుజుకి 39,506 గ్రాండ్ విటారా యూనిట్లను రీకాల్ చేసింది. ఎందుకంటే.. ఫ్యూయల్-లెవల్ డిస్‌ప్లే రాంగ్ రీడింగ్‌లను చూపిస్తున్నట్టు కంపెనీ గుర్తించింది. ఈ సమస్య కలగిన గ్రాండ్ విటారా కారు ఓనర్లకు ఉచితంగా చెక్ చేసి స్పేర్ పార్ట్స్ రిప్లేస్ చేయనుంది. ఇందుకోసం కంపెనీ నుంచి నేరుగా కస్టమర్లను సంప్రదించనుంది.
గ్రాండ్ విటారా ఎస్‌యూవీ బ్యాచ్ రీకాల్ (Maruti Grand Vitara) కోసం కంపెనీ 39,506 యూనిట్లను చెక్ చేయనుంది. ఇవన్నీ డిసెంబర్ 9, 2024, ఏప్రిల్ 29, 2025 మధ్య తయారయ్యాయి. ఆటోమేకర్ ప్రకారం.. కొన్ని వాహనాల్లోని ఫ్యూయల్ గేజ్, లో ఫ్యూయల్ అలర్ట్ లైట్ కచ్చితమైన రీడింగ్‌లను చూపించడం లేదని గుర్తించింది. డ్రైవర్లకు ట్యాంక్‌లో వాస్తవానికి మిగిలి ఉన్న ఫ్యూయల్ ఎంత అనేది తెలియదని పేర్కొంది. రాంగ్ రీడింగ్ చూపించవచ్చునని తెలిపింది. ఈ సమస్య కారణంగా, 39,506 యూనిట్లు రీకాల్ జాబితాలో చేర్చింది.
మీ SUV ఎఫెక్ట్ అయిందా? ఇలా చెక్ చేయించండి :
కస్టమర్లు తమ SUV కార్లను కంపెనీ సర్వీస్ సెంటర్లకు తీసుకురావాల్సి ఉంటుంది. అక్కడ టెక్ నిపుణులు స్పీడోమీటర్ అసెంబ్లీని చెక్ చేస్తారు. అవసరమైతే ఆ స్పేర్ పార్ట్ రిప్లేస్ చేస్తారు. ఈ సర్వీసు కూడా ఉచితంగా కంపనీ అందిస్తోంది. లాంగ్ టైమ్ సేఫ్టీ కోసం ముందు జాగ్రత్త చర్యగా రీకాల్‌ను చేపట్టినట్లు మారుతి సుజుకి తెలిపింది. యజమానులు నెక్సా అధికారిక వెబ్‌సైట్‌ను కూడా విజిట్ చేసి తమ ఛాసిస్ నంబర్‌ను రిజిస్టర్ చేయడం ద్వారా SUV కారు ఎఫెక్ట్ అయిందో లేదో చెక్ చేయవచ్చు.
స్పేర్‌పార్ట్స్ ఫ్రీ రిప్లేసింగ్ :
ఎఫెక్ట్ అయిన కస్టమర్ల కార్లు యజమానులను సంప్రదిస్తామని మారుతి సుజుకి పేర్కొంది. వాహనాన్ని చెక్ చేసేందుకు వినియోగదారులు కంపెనీ అధికారిక సర్వీసు సెంటర్ విజిట్ చేయాల్సి ఉంటుంది. స్పీడోమీటర్ అసెంబ్లీలో లోపాన్ని గుర్తిస్తే కారు, వారంటీ గడువు ముగిసినప్పటికీ, కంపెనీ ఆ పార్ట్ ఉచితంగా రిప్లేస్ చేస్తుంది.
గ్రాండ్ విటారా ధరలు :
గ్రాండ్ విటారా (ఎక్స్-షోరూమ్) ధరలు రూ. 10.77 లక్షల నుంచి రూ.19.72 లక్షల వరకు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో ప్రీమియం SUVగా నిలిచింది.
ఇంజిన్ ఆప్షన్లు :
మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.
1. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ :
101.5bhp, 137Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. కొన్ని వేరియంట్లలో ఆల్‌గ్రిప్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంది. తేలికపాటి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
2. 1.5-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ :
హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో పెట్రోల్ ఇంజన్ 90bhp, 122Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ మోటార్ 79bhp, 141Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అవుట్‌పుట్ 109bhp, eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఇంజన్ స్మూత్, సైలెంట్‌గా మరింత పవర్ ఫుల్‌గా ఉంటుంది.
ఫ్యూయిల్ కెపాసిటీ : ఏ వేరియంట్ ఎంత మైలేజీని ఇస్తుందంటే? :
గ్రాండ్ విటారా మైలేజ్ గణాంకాలు అతిపెద్ద ఫీచర్లలో ఒకటిగా చెప్పొచ్చు.
హైబ్రిడ్ ఇంజిన్ : 27.97 kmpl (గరిష్టంగా)
పెట్రోల్ మాన్యువల్ : 21.11kmpl
పెట్రోల్ ఆటోమేటిక్ : 20.58 కి.మీ.
AllGrip AWD వేరియంట్ : 19.20kmpl
ఈ గణాంకాలు హైబ్రిడ్ మోడల్ సెగ్మెంట్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే SUVలలో ఒకటిగా సూచిస్తున్నాయి.
